AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: అప్పటి వరకు ఆంక్షలు తప్పవు.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం..

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌తోపాటు కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలంతో మార్గదర్శకాలు పొడిగించారు...

Covid-19: అప్పటి వరకు ఆంక్షలు తప్పవు.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం..
Covid
Srinivas Chekkilla
|

Updated on: Oct 28, 2021 | 7:16 PM

Share

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగించింది. “ సెక్షన్ 10(2)( 1) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ద్వారా కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి 2021, సెప్టెంబర్ 28న అంతకు ముందున్న మార్గదర్శకాలను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  తాజాగా ఈ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు అములు ఉంటాయని హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా స్పష్టం చేశారు. దేశంలో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పొడిగించింది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌తోపాటు కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలంతో మార్గదర్శకాలు పొడిగించారు.

గత ఏప్రిల్, మేలో తీవ్ర ఉద్ధృతి చేరిన కరోనా ఇప్పుడు కాస్త తగ్గింది. థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. అయితే దేశంలో ప్రతిరోజూ 10,000 నుంచి 20,000 కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,156 మంది కోవిడ్ సోకింది. కరోనాతో 733 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 33,614,434 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,56,386 మంది మరణించారు. ప్రస్తుతం 1,60,989 క్రియాశీల కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 100 కోట్ల కోవిడ్-19 టీకాలు ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో తాజాగా ఏవై.4.2 వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. బెంగళూరులో మూడు కేసులు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ డి రణదీప్ ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో రెండు డెల్టా ఏవై కేసులు నమోదయ్యాయంటూ ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కూడా ఒక ఏవై 4.2 కరోనా వేరియంట్ కేసు నమోదైనట్లు తెలిపింది. అయితే.. ఈ కేసు 2021 జూన్ నెలలో నమోదైందని వెల్లడించింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఏవై 4.2 కేసులు నమోదు కాలేదంటూ స్పష్టంచేసింది.

Read Also..  PM Kisan Tractor Yojana: సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చా?.. అసలు నిజం ఏంటంటే.. Fact Check