AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabyasachi: యాడ్ తెచ్చిన తలపోటు.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే..

Sabyasachi Mukherjee: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి రూపొందించిన మంగళసూత్ర అడ్వర్టైజ్‌మెంట్ తీవ్ర దుమారం రేపుతోంది.

Sabyasachi: యాడ్ తెచ్చిన తలపోటు.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే..
Sabyasachi
Shiva Prajapati
|

Updated on: Oct 28, 2021 | 7:25 PM

Share

Sabyasachi Mukherjee: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి రూపొందించిన మంగళసూత్ర అడ్వర్టైజ్‌మెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ యాడ్‌పై పబ్లిక్ దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళసూత్రానికి సంబంధించి అర్ధనగ్నంగా ఉన్న మోడల్స్‌లో యాడ్స్ చిత్రీకరించారు ప్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి. ఈ యాడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు భగ్గుమంటున్నారు. మంగళసూత్రాన్ని అమ్మటానికి అర్ధనగ్నంగా ఉన్న మోడల్స్ పిక్చర్లు చూపించటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లోదుస్తులు, కండోమ్ యాడ్ లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుమించి క్రియేటివిటీ లేదా అంటూ విమర్శల వర్షం కురిపించారు. గే దంపతుల్లో ఒక మగ వ్యక్తి కూడా మంగళసూత్రం ధరించినట్లు చిత్రీకరించడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎప్పుడూ హిందూ సమాజ పద్ధతులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసభ్యతతో ఆలోచనలు వ్యక్తం చేయటం ఎలా క్రియేటివిటీ అంటూ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. భర్త పట్ల ప్రేమను చూపించే ఒక వస్తువును కించపరచటమే ఈ యాడ్ ఉద్దేశం అని అంటున్నారు. కేవలం కాంట్రవర్సీ ద్వారా ప్రాచుర్యంలోకి రావాలని ఇలాంటి చిత్రాలు, యాడ్స్ తీస్తు్న్నారని పబ్లిక్ భగ్గమంటున్నారు. ఈ విమర్శలు ఇలా ఉంటే.. మరోవైపు సబ్యసాచికి మద్ధతుగా నిలిచేవారు కూడా ఉన్నారు. ఆడవారు 24 గంటలు వేసుకునే మంగళసూత్రాన్ని వారి జీవితంలో కొన్ని ఘట్టాల్లో చూపిస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే.. సబ్యసాచికి కాంట్రవర్సీలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా నాసిరకం చీరలను అధిక ధరలకు విక్రయించి విమర్శలపాలయ్యారు. ఇప్పుడు ఈ యాడ్ ద్వారా మరోసారి ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తు్న్నారు.

Also read:

Varudu Kaavalenu: యంగ్ హీరో “నాగశౌర్య” ‘వరుడు కావలెను’ అంటున్న “రీతూ వర్మ”.. ఈ మూవీ పోస్టర్స్ పై ఓ లుక్కేయండి..

Covid-19: అప్పటి వరకు ఆంక్షలు తప్పవు.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం..

Ajith Long Drive on Bike Photos: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తల “అజిత్ కుమార్” బైక్‌పై లాంగ్ డ్రైవ్ ఫొటోస్..