MGNREGA: ఉపాధి హామీ పథకం నిధుల విడుదల ఎప్పుడు? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
MGNREGA: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురు చూడాల్సిన పరిస్ధితి ఉంటుంది.
MGNREGA: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురు చూడాల్సిన పరిస్ధితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 18 శాతానికి పైగా పెరుగుదల ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA ) సక్రమంగా అమలు చేయడం కోసం వేతనాలు, వస్తు చెల్లింపులకై నిధులను విడుదల చేస్తామని ప్రకటించింది. బడ్జెట్ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకానికి నిధుల కేటాయింపులో 18 శాతానికి పైగా పెరుగుదల ఉందని సంబంధిత శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు కోసం ఇప్పటివరకు రూ. 63,793 కోట్లకు పైగా నిధులు నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రూ. 8,921 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు ఈ నిధులు సరిపోతాయి. నిబంధనల ప్రకారం.. పథకం అమలుకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో తెలిపింది. “అదనపు నిధులు అవసరమైనప్పుడు ఆర్థిక శాఖను కోరడం జరుగుతుంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా కంటే ఎక్కువగా ఈ పథకం కోసం రూ. 50,000 కోట్ల నిధులను కేటాయించింది.’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది.
MGNREGA కింద, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీసం 100 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వబడుతుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 222 కోట్లకు పైగా పర్సనల్ డేస్‌ను రూపొందించినట్లు కేంద్ర తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 కోట్ల కుటుంబాలకు ఉపాధి లభించిందని పేర్కొంది. మొత్తం 99.63 శాతం మందికి ఉపాధి కల్పించబడిందన్నారు.
కాగా, ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు ఉపాధి పొందని లబ్ధిదారులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారుడు ఇప్పటికే 100 రోజులు పని చేసినా.. ఉపాధి హామీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు మరణించిన లబ్ధిదారులకు నిరుద్యోగ భృతి వర్తించదు. ఇదిలాఉంటే.. ఎస్సీ, ఎస్టీ మరియు ఇతరులకు కేటగిరీల వారీగా వేతన చెల్లింపు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుండి వర్తించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని కేంద్రం తెలిపింది.
Also read:
Warning to Pakistan: పాకిస్తాన్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వార్నింగ్.. నాశనం చేసేస్తామంటూ ప్రకటన!
Ind Vs nz: జట్టులో మార్పు ఉంటుందా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..?