Medical Devices Park: దేశంలో రూ.277 కోట్లతో వైద్య పరికరాల పార్కు.. 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
Medical Devices Park: కోవిడ్ కారణంతో దేశంలో వైద్య రంగం పట్ల కేంద్రం, రాష్ట్రాల ప్రాధాన్యత పెరిగింది. మెడిసిన్స్‌తో పాటు వైద్య పరికరాల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి.
కోవిడ్ కారణంతో దేశంలో వైద్య రంగం పట్ల కేంద్రం, రాష్ట్రాల ప్రాధాన్యత పెరిగింది. మెడిసిన్స్‌తో పాటు వైద్య పరికరాల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద వైద్య పరికరాల పార్కు(Medical Devices Park) హిమాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. అంటే రకాల వ్యాధిగ్రస్థులు ఉపయోగించే పలు రకాల ఉపకరాలను ఈ పార్కులో భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో రూ.277 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేయనుండగా.. ఇందులో రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం జై రామ్ ఠాగూర్ వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చులో రూ.160.95 కోట్లను రాష్ట్రం భరిస్తుందని చెప్పారు. సోలన్ జిల్లాలోని నాలాగఢ్‌లో 265 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటుకు భూమిని ఎంపిక చేశారు. ఈ పార్కు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్‌ను తమ రాష్ట్రానికి కేటాయించినందుకు ప్రధాని మోడీకి హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాగూర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో నాలుగు మెడికల్ ఉపకరణాల పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ గతంలో నిర్ణయించగా.. ఇందులో ఒక పార్కును అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని సీఎం జై రామ్ ఠాగూర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వీటి ద్వారా ఏటా రూ.20,000 కోట్ల టర్నోవర్ వచ్చే వచ్చే అవకాశముందన్నారు.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే వైద్య పరికరాలను.. దేశ వ్యాప్తంగా రోగుల అవసరాల మేరకు ఉపయోగించుకోవడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఈ పార్కులో ఏర్పాటుకానున్న పలు కంపెనీలు.. పల్స్ ఆక్సీమీటర్, వెంటిలేటర్లు, స్కానింగ్ మిషన్లు వంటి వైద్య ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నాయి. తద్వారా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. దేశీయంగానే వీటిని అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశముంటుంది. అయితే దేశీయ మార్కెట్లో ఉత్పత్తి అవుతున్నందున వీటిన ధరలు కూడా తగ్గే అవకాశముంది.
Also Read..
PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..
ప్రపంచంలోనే వింత ద్వీపం.. అక్కడకు వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఎక్కడుందో తెలుసా..