మీడియా పవర్ ఫుల్ వాచ్ డాగ్, దాన్ని నియంత్రించలేం, ఈసీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
మీడియా అన్నది శక్తిమంతమైన వాచ్ డాగ్ అని, కోర్టుల్లో జరిగే విషయాలను అది కమ్యూనికేట్ చేయగలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పులనే కాక , ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలను...
మీడియా అన్నది శక్తిమంతమైన వాచ్ డాగ్ అని, కోర్టుల్లో జరిగే విషయాలను అది కమ్యూనికేట్ చేయగలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పులనే కాక , ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలను, ఆందోళనలను, చివరకు డైలాగులను కూడా రిపోర్ట్ చేయగలదని న్యాయమూర్తులు జస్టిస్ వై.వీ.చంద్రచూడ్, జస్టిస్ షా లతో కూడిన బెంచ్ పేర్కొంది. హైకోర్టులు, ఉన్నత న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాలను కవర్ చేయకుండా మీడియాను నియంత్రించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఇది పవర్ ఫుల్ వాచ్ డాగ్ అని ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేమని బెంచ్ తెలిపింది. దేశంలో ఎన్నికల ర్యాలీలను ఈసీ అనుమతించడం వల్లే కోవిడ్ కేసులు పెరిగిపోయాయని, దీన్ని హత్యాభియోగంగా ఎందుకు పరిగణించరాదని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఎన్నికల కమిషన్ ను తీవ్రంగా దుయ్యబట్టింది. ఈసీ అధికారులమీద ఈ కేసు ఎందుకు పెట్టరాదని ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యం వల్లే కోవిద్ కేసులు పెరిగిపోయాయని విమర్శించింది. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఈసీ..వాటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కింది.మీడియాను నియంత్రించాలని తన పిటిషన్ లో కోరింది. రాజ్యాంగ సంస్థ అయిన తమకు ఎన్నికలను నిర్వహించే అధికారం ఉందని వెల్లడించింది.
ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తూనే..కోర్టు విచారణలను మీడియా రిపోర్టు చేయజాలదని ప్రస్తుత పరిస్థితుల్లో తాము చెప్పజాలమని స్పష్టం చేసింది. హైకోర్టులో జరిగే చర్చలు కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ప్రజల ఆసక్తిని బట్టి ఉంటాయని, పబ్లిక్ ఇంట్రెస్టును పురస్కరించుకుని కోర్టులు చేసే ఏ వ్యాఖ్యలనైనా ఈసీ సరైన చేదు మాత్రగా పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.హైకోర్టుల నైతిక సామర్థ్యాన్ని కించపరచాలన్నది తమ ఉదేశ్యం కాదని, జుడీషియరీకి అవి మూల స్తంభాలని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టుల్లో కొని సందర్భాల్లో స్వేచ్ఛగా కొన్ని డైలాగులు వస్తుంటాయని, జడ్జీలు నిర్వహించే ప్రొసీడింగులను మీరు (ఈసీ) కంట్రోల్ చేయజాలరని ఆయన పేర్కొన్నారు. అసౌకర్యంగా ఉండే ప్రశ్నలను అడిగే స్వేచ్ఛ వారికి ఉందని, కానీ అలా వ్యవహరించబోరని ఆయన చెప్పారు. అటు-మద్రాస్ హైకోర్టు చేసింది డైలాగులు కావని, ఆ వ్యాఖ్యలు తీర్పుల్లా లేవని ఈసీ వ్యాఖ్యానించగా.. ప్రతి అంశాన్నీ ఆర్డర్ మాదిరి పరిగణించలేమని జస్టిస్ షా అన్నారు. ఇది హ్యూమన్ ప్రాసెస్ అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : బాలయ్య ‘అఖండ’ పైనే ప్రజ్ఞ జైస్వాల్ ఆశలు అన్ని.. Pragya Jaiswal video. మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …