AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా టార్గెట్ పాక్ పౌరులు కాదు.. ఆ దేశ ప్రార్ధనా మందిరాలపై దాడి జరగలేదు: విక్రమ్ మిస్రి

ఆపరేషన్ సింధూర్‌‌పై కీలక ప్రెస్‌మీట్ నిర్వహించింది భారత విదేశాంగ శాఖ. LOC వెంబడి నిరంతరం పాక్ ఉల్లంఘనలకు పాల్పడి సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. నిన్న రాత్రి పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ దాడులకు పాల్పడింది.

మా టార్గెట్ పాక్ పౌరులు కాదు.. ఆ దేశ ప్రార్ధనా మందిరాలపై దాడి జరగలేదు: విక్రమ్ మిస్రి
Mea Breifing
Ravi Kiran
|

Updated on: May 09, 2025 | 6:24 PM

Share

ఆపరేషన్ సింధూర్‌‌పై కీలక ప్రెస్‌మీట్ నిర్వహించింది భారత విదేశాంగ శాఖ. LOC వెంబడి నిరంతరం పాక్ ఉల్లంఘనలకు పాల్పడి సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. నిన్న రాత్రి పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ దాడులకు పాల్పడింది. లేహ్‌ నుంచి సర్‌క్రీక్‌ వరకు 36 చోట్ల దాడులకు తెగబడిందన్నారు. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడులు చేసిందని.. టర్కీ డ్రోన్లతో అటాక్ చేసినట్టు ప్రాధమికంగా గుర్తించామని చెప్పారు. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టామని, అనేక డ్రోన్లను కైనటిక్‌, నాన్ కైనటిక్‌ సాధనాలతో కూల్చేశామని వివరించారు. భారత్ ప్రతిదాడిలో పాక్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకొని పాక్ ఆర్మీ దాడి చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. కరాచీ-లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయని చెప్పారు. భారత్‌ వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోందని.. ఎయిర్‌స్పేస్‌ మూసేశామని పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు.

భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడిందన్నారు వింగ్ కమాండర్ వోమికా సింగ్. లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేశారని., 300-400 డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రయత్నించారని వివరించారు. భద్రతా దళాలు వీటిలో చాలావరకు నిర్వీర్యం చేశాయని వెల్లడించారు. ప్రతిదాడిగా పాక్‌లోని 4 ప్రాంతాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసిందన్నారు. పాక్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదని.. పౌర విమానాలను పాక్ కవచంలా వాడుకుంటోందని చెప్పారు.

మరోవైపు ‘ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌ తప్పుడు ప్రచారం తీవ్రంగా చేస్తోందన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధం.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసేశాం. పూంఛ్‌లోని స్కూల్‌పై పాక్‌ దాడిలో ఇద్దరు విద్యార్థుల మృతి చెందారు. స్కూల్‌ సిబ్బంది, నన్స్‌ అందరూ దాక్కున్నారు. దాడి సమయంలో స్కూల్‌ మూసేసి ఉంది. ఇక గురుద్వారాలు, గుడులు, కాన్వెంట్లు లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడులకు తెగబడిందని’ ఆమె చెప్పారు.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..