మారిషస్ లో భారతీయ కెప్టెన్ అరెస్ట్, ఎందుకంటే ?

మారిషస్ లో భారతీయ నేవీ కెప్టెన్ ఒకరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. జపాన్ కు చెందిన నౌకను నడుపుతున్న ఈ కెప్టెన్ కొన్ని వందల టన్నుల ఆయిల్ ని సముద్రం పాల్జేశాడట..

మారిషస్ లో భారతీయ కెప్టెన్ అరెస్ట్, ఎందుకంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 19, 2020 | 10:37 AM

మారిషస్ లో భారతీయ నేవీ కెప్టెన్ ఒకరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. జపాన్ కు చెందిన నౌకను నడుపుతున్న ఈ కెప్టెన్ కొన్ని వందల టన్నుల ఆయిల్ ని సముద్రం పాల్జేశాడట.. జులై 25 నుంచి కొన్ని రోజులుగా ఆ కెప్టెన్ ఈ నిర్వాకానికి పాల్పడినట్టు తెలిసింది. సింగపూర్ నుంచి బ్రెజిల్ వెళ్తున్న ఈ నౌక మారిషస్ సమీపం వరకు ఎందుకు వచ్చిందో తెలియడంలేదంటున్నారు. ఇతని డెప్యూటీ శ్రీలంకకు చెందిన వాడని సమాచారం. అతడిని కూడా అధికారులు అరెస్టు చేశారు. పైరసీ, సముద్ర హక్కుల ఉల్లంఘన నేరాల కింద వీరిని అదుపులోకి తీసుకున్నామని, ప్రాథమికంగా కోర్టులో హాజరు పరిచామని అధికారులు వెల్లడించారు. కాగా వీరి ని మళ్ళీ ఈ నెల 25 న కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టు వీరి శిక్షను ధృవీకరించ నుంది.

అటు-సముద్రంపాలైన ఆయిల్ ని తొలగించేందుకు జపాన్ నిపుణుల బృందాన్ని మారిషస్ కు పంపుతోంది.