Silver Price Today : పరుగులు పెడుతున్న వెండి.. దేశంలోని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర ఎంతవుందంటే..
దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధర మాత్రం పరుగులు పెడుతుంది. బంగారం ధర
Silver Price Today : దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధర మాత్రం పరుగులు పెడుతుంది. బంగారం ధర కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తుంది. నేడు (మార్చి 11న) స్థిరంగా ఉంది. కానీ వెండి ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ఉన్న ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కిలో వెండి రూ.66,500 ఉంది. అలాగే బెంళూరులో రూ. 66,500, అలాగే చెన్నైలో రూ.71,400, కోల్‌కతాలో రూ.67,000, హైదరాబాద్ రూ.71,400 ఉండగా, విజయవాడలో రూ.71,400 ఉంది,. ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.71,400వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశీయంగా పరిశీలిస్తే బంగారం, వెండి ధరలపై ఎఫెక్ట్ చూపే అంశాలు చాలా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bharat Bandh: 26 న భారత్ బంద్ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ పాటించాలని రైతు సంఘాల పిలుపు
Onion Price Reduced: దిగి వస్తున్న ఉల్లిపాయ ధర.. ఏడు రోజుల్లో 21 రూపాయలు తగ్గిన ఉల్లి