AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. ఆకేసులో అవకతవకలు గురించే..

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసంలో ఈఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి

Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. ఆకేసులో అవకతవకలు గురించే..
Manish Sisodia
Amarnadh Daneti
|

Updated on: Aug 19, 2022 | 10:42 AM

Share

Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసంలో ఈఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -CBI ఈరోజు ఢిల్లీలోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంతో సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని.. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని..అందుకే ఈవిచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు రావని ట్వీట్ చేశారు. మంచి పనులు చేసే వారిని దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని వేధించడం దురదృష్టకరమన్నారు. సీఐఐ విచారణను స్వాగతిస్తున్నామని.. నిజానిజాలు బయటకు వచ్చేలా పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇప్పటివరకు తనపై ఎన్ని కేసులు పెట్టిన ఒక్కటి కూడా రుజువు కాలేదని, ఇది అలాంటిదేనన్నారు. దేశంలో అందరికి నాణ్యమైన విద్య అందించడం కోసం తాను చేస్తున్న కృషిని తప్పుడు కేసుల ద్వారా నిలవరించలేరని ట్విట్టర్ లో మనీష్ సిసోడియా పేర్కొన్నారు. దేశంలో మంచి పనులు చేసే వారిని వేధించడం దురదృష్టకరమని.. అందుకే ఈదేశం ఇంకా నెంబర్ 1 కాలేదంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం హయాంలో పాఠశాలల సమగ్ర మార్పుపై ది న్యూయార్క్ టైమ్స్ తన అంతర్జాతీయ ఎడిషన్ లో కథనాన్ని ప్రచురించింది. ఈకథనం వచ్చిన రోజునే సీబీఐ సోదాలు చేయడం రాజకీయ కుట్రలో భాగమని ఆమ్ ఆద్మీ నాయకులు ఆరోపిస్తున్నారు. సీబీఐ సోదాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. CBI విచారణను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో న్యూయార్క్ టైమ్స్ వార్త పత్రిక మొదటి పేజీలో మనిష్ సిసోడియా ఫోటోను ముద్రించిన ఢిల్లీ విద్యా నమూనాను ప్రశంసించిన రోజునే కేంద్రప్రభుత్వం అతడి ఇంటికి సీబీఐని పంపుతుందని ఆరోపించారు.