Karnataka: సిద్ధరామయ్య గోబ్యాక్.. మాజీ సీఎం కొడగు జిల్లా పర్యటనలో ఉద్రికత్త.. ఎందుకంటే..

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, వరద బాధితులను

Karnataka: సిద్ధరామయ్య గోబ్యాక్.. మాజీ సీఎం కొడగు జిల్లా పర్యటనలో ఉద్రికత్త.. ఎందుకంటే..
Siddaramaiah
Follow us

|

Updated on: Aug 19, 2022 | 9:45 AM

Karnataka: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, వరద బాధితులను పరామర్శించేందుకు కొడగు జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న భారతీయ జనతా యువమోర్చ-BJYM కార్యకర్తలు మడికేరిలో సిద్ధరామయ్యను ఘెరావ్ చేశారు. కొడుగు జిల్లా శివార్లలోని తితిమతిలో నల్లజెండాలు చూపిస్తూ.. గోబ్యాక్ సిద్ధు అంటూ నినాదాలు చేశారు. గతంలో వద్దని చెప్పినా వినకుండా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించి విద్వేషాలను రెచ్చగొట్టారని.. అందుకే ఈనిరసనను ప్రజల నుంచి ఎదుర్కొవల్సి వచ్చిందని బీజేపీ నాయకుల తెలిపారు.

కొడుగు ప్రజలు గోమాంసాన్ని తింటారంటూ గతంలో సిద్ధరామయ్య వ్యాఖ్యానించారన్నారు. మడికేరిలోనూ సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. ఈసమయంలో మడికేరి టోల్ గేటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై మరొకరు కోడిగుడ్లు విసురుకున్నారు. హిందూ వ్యతిరేకి, కొడవ వ్యతిరేకి సిద్ధరామయ్య అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడగు నుంచి తిరిగి వస్తుండగా.. కుశాల్ నగర్ లోని గుడ్డు హోసూరు సమీపంలో కూడా సిద్ధరామయ్య వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని, నినాదాలు చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. సిద్దరామయ్య వివాదస్పద వ్యాఖ్యల కారణంగానే తాము నిరసన తెలిపామని బీజేపీ నాయకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..