Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించాలి.. మణిపుర్ సీఎం సూచనలు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నాలుగు నెలలుగా అక్కడి జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్.. మయన్మార్ సరిహద్దులో భద్రతపై దృష్టి సారించారు. ఆ దేశం నుంచి వచ్చే చొరబాట్లను నివారించడానికి 70 కిలోమీటర్ల వరకు కంచెను నిర్మింటాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

Manipur: మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించాలి.. మణిపుర్ సీఎం సూచనలు
Cm Biren Singh
Follow us
Aravind B

|

Updated on: Sep 24, 2023 | 9:52 PM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నాలుగు నెలలుగా అక్కడి జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్.. మయన్మార్ సరిహద్దులో భద్రతపై దృష్టి సారించారు. ఆ దేశం నుంచి వచ్చే చొరబాట్లను నివారించడానికి 70 కిలోమీటర్ల వరకు కంచెను నిర్మింటాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్)లో వివరించారు. అలాగే శనివారం రోజున ఇంఫాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్’ వల్ల భారత్‌-మయన్మార్‌ ప్రజలు ఇరువైపులా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 16 కిలోమీటర్ల మేర సంచరించే వీలుందని పేర్కొన్నారు.

దీనివల్లే అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంట పడకుండా సులువుగా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్’ను రద్దు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆదివారం బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఇందులో సీఎస్‌, డీజీపీ సహా పలువుకు హోంశాఖ అధికారులు సైతం ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే భారత్-మయన్మార్ సరిహద్దులో 70 కిలోమీటర్ల వరకు ఉన్న అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బీఆర్‌వోకు ముఖ్యమంత్రి తెలిపారు. సరిహద్దులోని లోపాల వల్ల పొరుగు దేశం నుంచి అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే అత్యవసరంగా అదనపు కంచె ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.

ఇదిలా ఉండగా.. భారత్‌-మయన్మార్‌ మొత్తం సరిహద్దు పొడవు 1600 కిలోమీటర్లు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో చూసుకుంటే ఐదు జిల్లాలు 400 కిలోమీటర్ల వరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే ఇందులో కంచె కేవలం 10 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. దీనివల్ల ఇబ్బడిముబ్బడిగా మాదక ద్రవ్యాలు సైతం భారత్‌లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక కారణాల వల్ల కూడా మొత్తం సరిహద్దుకు కంచె వేయడం సాధ్యం కాదని వ్యూహాత్మక నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్రమ వలసలు అధికంగా ఉన్న చోట మాత్రం కంచె వేసుకునే వెసులుబాటు ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. మణిపుర్‌లో మే3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ఈ అల్లర్లలో సుమారు 175 మందికి పైగా మృతి చెందారు. అలాగే వందల మంది గాయలపాలయ్యారు. ఇటీవలే మళ్లీ అక్కడ అల్లర్లు చెలరేగడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..