నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఒక వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతుడిని బీహార్ నివాసి మనోజ్ మహతోగా గుర్తించారు..

ఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతుడిని బీహార్ నివాసి మనోజ్ మహతోగా గుర్తించారు. మృతుడి భార్య ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
GRP SHO రాజ్ పాల్ మాట్లాడుతూ.. గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ ఈ సంఘటన గురించి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అప్పటికే ఐదుగురు మృతి చెంది కనిపించారు. మృతుడి వద్ద అతని భార్య ప్రీతి ఫోన్ నంబర్‌తోపాటు ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రీతి మృతదేహాలను గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించినట్లు ఎస్‌హెచ్‌ఓ రాజ్ పాల్ తెలిపారు.
తన భర్త, పిల్లలను పార్కుకు తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చినట్లు నేహ పోలీసులకు తెలిపింది. అయితే ఇలా తనతోపాటు పిల్లలను కూడా తనకు దూరం చేస్తాడని ఊహించలేదని మృతుడి భార్య ప్రీతి రోదించింది. తన భర్త తన బంధువులలో ఒకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటం వల్ల తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకన్నాడనీ, ఈ కారణంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.