AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిఫిన్‌లో తలవెంట్రుక కనిపించడంతో.. ఓ భర్త ఎంతపని చేశాడో తెలుసా?

రోజులు మారుతున్నా.. మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందనడానికి ఉదాహరణగా  ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దేశం ఏదైనా సరే దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  బంగ్లాదేశ్ ‌రాజధాని జోయ్‌పూర్హట్ ప్రాంతంలో ఓ అమామనవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య తయారు చేసిన టిఫిన్‌లో తల వెంట్రుక కనిపించిందనే కారణంతో ఏకంగా ఆమెకు శిరోముండనం చేయించాడు ఓ భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని జోయపుర్హట్ జిల్లాలోగల ఓ గ్రామంలో బాబుల్ మండల్(37) అనే వ్యక్తి తన […]

టిఫిన్‌లో తలవెంట్రుక కనిపించడంతో.. ఓ భర్త ఎంతపని చేశాడో తెలుసా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 11:43 AM

Share

రోజులు మారుతున్నా.. మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందనడానికి ఉదాహరణగా  ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దేశం ఏదైనా సరే దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  బంగ్లాదేశ్ ‌రాజధాని జోయ్‌పూర్హట్ ప్రాంతంలో ఓ అమామనవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య తయారు చేసిన టిఫిన్‌లో తల వెంట్రుక కనిపించిందనే కారణంతో ఏకంగా ఆమెకు శిరోముండనం చేయించాడు ఓ భర్త.

పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని జోయపుర్హట్ జిల్లాలోగల ఓ గ్రామంలో బాబుల్ మండల్(37) అనే వ్యక్తి తన 23ఏళ్ల భార్యను టిఫిన్ అడిగాడు. అడిగిన వెంటనే ఆమె పాలు, రొట్టెతో కలిపి టిఫిన్ రెడీ చేసి వేడివేడిగా అతడికి దాన్ని వడ్డించింది. అయితే ఆ టిఫిన్‌లో బాబుల్ మండల్‌కి ఓ తల వెంట్రుక కనిపించింది. దీన్ని గమనించిన అతడు ఆ వెంట్రుక ఆమెదే అని తీవ్రంగా నిందిస్తూ .. ఆగ్రహానికి గురై భార్యను తీవ్రంగా కొట్టాడు. అక్కడితో కోపం చల్లారకపోవడంతో ఏకంగా బ్లేడ్‌తో ఆమె తలను మొత్తం గుండుగా మార్చేశాడు. వద్దు వద్దు అని ఎంత ప్రాధేయపడ్డా భర్త విడిచిపెట్టలేదు. దీంతో బాబుల్ మండల్ ఇంట్లోనుంచి కేకలు అరుపులు విన్న స్ధానికులు వచ్చి చూసి అతడిపై తీవ్రంగా మండిపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అత్యాచారాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు 630 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 37 మంది మహిళలు అత్యంత దారుణంగా చంపబడ్డారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణంలో ఈ చర్యకు పాల్పడ్డ బాబుల్ మండల్‌కి 14 సంవత్సరాల జైలు శిక్షపడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్