AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రాప్తాడు ఘటన.. షోరూమ్‌లోకి వెంటాడి 17 ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య!

ఢిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ గార్మెంట్ షోరూమ్‌లో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలిని 18 ఏళ్ల షబ్నంగా గుర్తించారు. సూరజ్ అనే వ్యక్తి షోరూమ్‌లోకి ప్రవేశించి బాలిక ఫోన్ లాక్కొని దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాలిక షోరూమ్‌లోని ట్రైనింగ్ రూమ్‌లోకి పరుగెత్తింది. అయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు..

మరో రాప్తాడు ఘటన.. షోరూమ్‌లోకి వెంటాడి 17 ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య!
Teen Employee Found Dead Inside Trial Room In Delhi Showroom
Srilakshmi C
|

Updated on: Nov 15, 2026 | 12:24 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బట్టల షోరూమ్‌లో పనిచేస్తున్న 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో గొంతు కోసిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సూరజ్ అనే వ్యక్తిపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వ్యక్తిగత సంబంధాల్లో తలెత్తిన విభేదాలు, ఏకపక్ష ప్రేమ ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..

పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ బట్టల షోరూమ్‌లో షబ్నమ్ పనిచేస్తోంది. శనివారం సాయంత్రం ఆమె విధులు ముగిసే సమయంలో సూరజ్ అనే వ్యక్తి షోరూమ్‌కు వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు తన వెంట పదునైన ఆయుధాన్ని తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షబ్నమ్‌తో మాట్లాడాలనే నెపంతో ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. అనంతరం ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో షోరూమ్ మూసివేసేందుకు సిబ్బంది సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రయల్ రూమ్‌లో పరిశీలించగా షబ్నమ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి కచ్చితమైన కారణాలను పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారించనున్నారు. షబ్నమ్, సూరజ్ గతంలో ఒకరికొకరు పరిచయస్తులని, స్నేహపూర్వక సంబంధాలు కూడా ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే గత కొన్ని నెలలుగా వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూరజ్ గతంలోనూ షబ్నమ్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వ్యక్తిగత సంబంధాల్లో వచ్చిన విభేదాలు, ఏకపక్ష ప్రేమ కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య వెనుక అసలు కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీని సేకరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు షోరూమ్‌కు వచ్చిన మార్గం, అక్కడి నుంచి పరారైన దారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. యువతి హత్యకు గల అసలు కారణాలు, నిందితుడి పాత్రపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Follow Us