మరో మహిళతో అక్రమ సంబంధం.. విడాకుల కోసం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. ఐదుగురు మృతి..

తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యా.. భర్తల మధ్య విడాకుల వివాదం.. ఐదుగురి మృతికి కారణమైంది. పోట్రోల్‌తో అత్త ఇంటికి వచ్చిన అల్లుడు.. నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు.

మరో మహిళతో అక్రమ సంబంధం.. విడాకుల కోసం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. ఐదుగురు మృతి..
Affair
Follow us

|

Updated on: Feb 09, 2023 | 1:49 PM

తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యా.. భర్తల మధ్య విడాకుల వివాదం.. ఐదుగురి మృతికి కారణమైంది. పోట్రోల్‌తో అత్త ఇంటికి వచ్చిన అల్లుడు.. నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో మంటలు చెలరేగి అతనితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులు.. మరొకరు చనిపోయారు. కడలూరు చెల్లాంకుప్పంలో జరిగిన ఈ దారుణ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలూరు పిళ్లయార్‌ వీధిలోని ఓ ఇంట్లో ప్రకాష్‌ (35), తమిళరసి (31), ఏడాది వయసున్న కుమార్తె హాసిని, తమిళరసి తల్లి సెల్వి నివాసం ఉంటున్నారు. తమిళరసి సోదరి ధనలక్ష్మికి రెండేళ్ల క్రితం దేవనంపట్నానికి చెందిన సద్గురుతో ప్రేమ వివాహమైంది. వీరికి ఆరు నెలల బిడ్డ ఉన్నాడు. అయితే.. పెళ్లైన కొంత కాలం నుంచి ధనలక్ష్మి, సద్గురుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. సద్గురు మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. విడాకులు ఇవ్వాలని వేధింపులకు పాల్పడటంతో ఆమె తన ఆరునెలల బిడ్డతో సహా తమిళరసి ఇంటికి వచ్చేసింది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే ప్రకాష్‌ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లో ధనలక్ష్మి, తమిళరసి, సెల్వి, ఇద్దరు పసి బిడ్డలు మాత్రమే ఉన్నారు. విడాకులు ఇవ్వాలంటూ ఆగ్రహంతో ఇంట్లోకి వచ్చిన సద్గురు.. భార్య ధనలక్ష్మితో ఘర్షణ పడ్డాడు. తర్వాత తన వెంట తెచ్చుకున్న క్యాన్‌లోని పెట్రోల్‌ను పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమిళరసి, ఇద్దరు పసిబిడ్డలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ధనలక్ష్మి, అత్త సెల్వి, భర్త సద్గురును ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో సద్గురు మరణించగా.. ధనలక్ష్మి చికిత్స పొందుతూ మరణించింది. సెల్వి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..