నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఈ ఆటోవాలా.. ఏం చేశాడో తెలిస్తే ‘శభాష్ డ్రైవరన్న’ అనేస్తారంతే..
నీతి, నిజాయితీ వంటి మాటలు ఎవరైనా పొరపాటున ఇచ్చరిస్తేనే.. చాదస్తం కింద కొట్టిపారేసే రోజులివి. నైతిక విలువలు పాటించేవాళ్లు మచ్చుకైనా కనపడటం లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది ఓ ఆటోవాలా..

నీతి, నిజాయితీ వంటి మాటలు ఎవరైనా పొరపాటున ఇచ్చరిస్తేనే.. చాదస్తం కింద కొట్టిపారేసే రోజులివి. నైతిక విలువలు పాటించేవాళ్లు మచ్చుకైనా కనపడటం లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది ఓ ఆటోవాలా ఎవరో పొరబాటున జార విడుచుకున్న రూ.25 లక్షల క్యాష్ బ్యాగ్‌ను లటుక్కున దాచేయకుండా.. ఎంతో చిత్తశుద్ధితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ అప్పగించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోదీనగర్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆస్ మహ్మద్ (40)కు మంగళవారం (ఫిబ్రవరి 7) రోడ్డు పక్కన బ్యాగ్ పడి ఉండడాన్ని గమనించాడు. తెరచి చూస్తే రూ.25 లక్షల నోట్ల కట్టలు కనిపించాయి. ఆ బ్యాగ్ ఎవరిదై ఉంటుందా అని చుట్టూ పరికించి చూశాడు. ఎవ్వరూ కనిపించకపోవడంతో మహ్మద్ ఆ బ్యాగ్ తీసుకుని నేరుగా మోడీనగర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు అప్పగించాడు. పోలీసు అధికారులు బ్యాగ్‌ని తనిఖీ చేయగా పాతిక లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. మహ్మద్ నిజాయితీకి ముగ్ధుడైన డీసీపీ డ్రైవర్‌కు ప్రశంసా పత్రం అందించడంతోపాటు ఘనంగా సత్కరించారు.
దీనికి సంబంధించిన ఫొటోను ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) కమిషనరేట్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రోడ్డు పక్కన దొరికిన క్యాష్ బ్యాగ్‌ని అందజేసి నిజాయితీకి ఉదాహరణగా నిలిచిన ఆటో డ్రైవర్‌ను డీసీపీ రూరల్ సత్కరించారంటూ’ తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా గతేడాది కూడా ఇదే తరహాలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయి వదిలేసిన రూ. 6 లక్షల విలువైన నగలు, రూ.50,000 నగదును తిరిగి అందించి, తన నిజాయితీతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.




#PoliceCommissionerateGhaziabad सड़क किनारे मिले पैसो से भरे बैग को पुलिस को सौप कर ईमानदारी की मिसाल पेश करने वाले ई रिक्शा चालक को डीसीपी ग्रामीण द्वारा किया गया सम्मानित pic.twitter.com/uyOQVcn6cB
— DCP RURAL COMMISSIONERATE GHAZIABAD (@DCPRuralGZB) February 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.