అన్నంలో గుడ్డు ఇచ్చిన భార్య.. ఆశగా తినాలనుకుంటే.. ఆ తర్వాత జరిగిందిదే..
ఓ గుడ్డు నిండు ప్రాణాన్ని తీసింది.. అవును.. చెప్పింది నిజమే.. ఏమరపాటుతోపాటు.. అజాగ్రత్తగా ఉంటే.. ఏదైనా ప్రాణాంతకంగా మారుతుంది.. అశ్రద్ధగా ఉంటే.. గుండు పిన్ను కూడా ప్రాణం తీస్తుందంటారు.. అలాగే, ఇక్కడ కూడా ఓ ఉడకబెట్టిన గుడ్డు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఉకబెట్టిన కోడి గుడ్డును అమాంతం మింగడంతో.. ఊపిరాడక ఓ వ్యక్తి మరణించాడు..

ఓ గుడ్డు నిండు ప్రాణాన్ని తీసింది.. అవును.. చెప్పింది నిజమే.. ఏమరపాటుతోపాటు.. అజాగ్రత్తగా ఉంటే.. ఏదైనా ప్రాణాంతకంగా మారుతుంది.. అశ్రద్ధగా ఉంటే.. గుండు పిన్ను కూడా ప్రాణం తీస్తుందంటారు.. అలాగే, ఇక్కడ కూడా ఓ ఉడకబెట్టిన గుడ్డు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఉకబెట్టిన కోడి గుడ్డును అమాంతం మింగడంతో.. ఊపిరాడక ఓ వ్యక్తి మరణించాడు.. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది.. కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్ మలైయాంగుళం ప్రాంతానికి చెందిన రవి (55).. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.. ఇతనికి భార్య వలర్మతి, కుమార్తె స్నేహ ఉన్నారు. అయితే.. రవి బుధవారం రాత్రి ఇంటికెళ్లి భోజనం పెట్టాలని అడిగాడు.. దీంతో అతని భార్య వలర్మతి.. రవికి భోజనం పెట్టింది.. అలాగే.. ఉడకబెట్టిన కోడి గుడ్డును కూడా ఇచ్చింది.
భోజనం చేస్తూ.. రవి కోడిగుడ్డును అమాంతం మింగేశాడు.. గుడ్డు గొంతులో చిక్కుకుపోవడంతో విలవిలలాడుతూ కుప్పకూలిపోయాడు.. దీంతో కుటుంబ సభ్యులు రవిని .. హుటాహుటిన పడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. రవి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ.. ఇంటికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




