Viral: రాంగ్ రూట్‌లో వచ్చి రచ్చ చేశారు.. కానిస్టేబుళ్లపై కాలేజీ స్టూడెంట్స్ దాడి..!

Viral: ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. వాహనాలను సరైన మార్గంలో నడపండి.. బైక్‌పై ఇద్దరు మినహా ఎక్కువ ప్రయాణించొద్దు..

Viral: రాంగ్ రూట్‌లో వచ్చి రచ్చ చేశారు.. కానిస్టేబుళ్లపై కాలేజీ స్టూడెంట్స్ దాడి..!
Delhi Police
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2022 | 6:36 PM

Viral: ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. వాహనాలను సరైన మార్గంలో నడపండి.. బైక్‌పై ఇద్దరు మినహా ఎక్కువ ప్రయాణించొద్దు.. హెల్మెట్ తప్పనిసరి, ఇలా అనేక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు. పైగా దురుసు ప్రవర్తన ఒకటి. తామే తోపులమన్న అహంభావం, తమనెవరు అడ్డుకుంటారనే పొగరు. వెరసి అనేక మంది ప్రమాదాల బారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టైమ్ బాగోలేక బైక్‌పై వెళ్తున్న వారు కింద పడిన, మరమైనా అయినా హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. లేదంటే గోడకు ఫోటో వేలాడటం దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని అధికారులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా తమనే అడ్డుకుంటారా? అంటూ హూంకరింపులు ఒకటి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కాలేజీ విద్యార్థులు రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా, అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ గల్లా పట్టుకుని హల్ చల్ చేశారు.

ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై రాంగ్ రూట్‌లో వచ్చారు. ఇది గమనించిన ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు.. వారిని అడ్డగించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్, పైగా నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో పోలీసులు వారిని ఆపారు. ఇక అంతే.. ఆ ముగ్గురూ కలిసి కానిస్టేబుళ్లపై విరుచుకుపడ్డారు. ఓ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుళ్లు, ఇతర వ్యక్తులు ఎంత సముదాయిస్తున్నా వినకుండా ఓవర్ యాక్షన్ చేశారు. ఇక లాభం లేదనుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ముగ్గురు కాలేజీ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..