Viral: చిన్నారి మృతికి కారణమైన ఆవు.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన అధికారులు.. శిక్ష తప్పదట..!

Police Arrested A Cow: ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు తమ భౌగోళిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, అనేక రకాల పరిస్థితులకు

Viral: చిన్నారి మృతికి కారణమైన ఆవు.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన అధికారులు.. శిక్ష తప్పదట..!
Cow
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 08, 2022 | 10:27 AM

Police Arrested A Cow: ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు తమ భౌగోళిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, అనేక రకాల పరిస్థితులకు తగ్గట్లుగా రాజ్యాంగాలను, చట్టాలను చేసుకుంటాయి. వాటిని ఆయా దేశాల ప్రజలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే, ఏ దైశంలోనైనా జంతువుల రక్షణకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ, జంతువులకు శిక్షించడానికి సంబంధించి చట్టాలేవీ లేవు. కానీ, చాలా దేశాలలో తప్పు చేస్తే మనుషులు శిక్ష అనుభవించినట్లే.. జంతువులు కూడా నేరం చేస్తే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆయా జంతువులకు చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు కూడా. తాజాగా ఇలాంటి వింత కేసు ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆఫ్రికన్ కంట్రీ సుూడాన్‌లో ఆవును అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. దానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ సుడాన్‌లో12 ఏళ్ల చిన్నారిని ఆవు చంపేసింది. ఈ కేసులో ఆవుని, దాని యజమానిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో యజమాని తప్పేమీ లేదని, ఆవు మాత్రం చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపేసిందని పోలీసులు నివేదిక రూపొందించారు. ఆవు.. ఆ చిన్నారిని తీవ్రంగా గాయపరచడం వలన ప్రాణాలు కోల్పోయిందని, అందుకే దానిని అరెస్ట్ చేశామని పోలీసు అధికారి మేజర్ ఎలిజే చెప్పారు. ప్రస్తుతం ఆవును రుంబెక్ సెంట్రల్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ హత్య కేసులో విచారణ జరుపుతున్న అధికారులు.. ఆవుకు తప్పకుండా శిక్ష పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆవు యజమానికి జరిమానా విధించడం జరుగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..