AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic People: ఇలాంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి.. లేదంటే లేని సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది..

Toxic People: మనం నిత్య జీవితంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తుంటాం. ప్రతి వ్యక్తి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి తనదైన భిన్నమైన ఆలోచన ఉంటుంది.

Toxic People: ఇలాంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి.. లేదంటే లేని సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది..
Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2022 | 7:30 AM

Toxic People: మనం నిత్య జీవితంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తుంటాం. ప్రతి వ్యక్తి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి తనదైన భిన్నమైన ఆలోచన ఉంటుంది. వీరిలో కొందరు మనుషులు మాత్రం విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులను కొన్నిసార్లు ఈజీగా గుర్తుపట్టొచ్చు.. కానీ, కొన్నిసార్లు అంత ఈజీగా గుర్తుపట్టలేము. అలాంటి వారి గురించి తెలుసుకోవడం కొంత ఆలస్యం అవుతుంది. ఇలాంటి వ్యక్తులు మీ స్వంత సామర్థ్యాన్ని అనుమానిస్తుంటారు. ఎప్పుడూ ప్రతికూలంగా మాత్రమే మాట్లాడుతారు. దీని కారణంగా మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. మరి విషపూరితమైన ఆలోచనలు కలిగిన వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి అంశంపై ప్రతికూలంగా మాట్లాడటం.. చాలా మంది దాదాపు ప్రతి విషయంలోనూ ప్రతికూలంగా ఉంటారు. ఇతరుల తప్పులను మాత్రమే వెతికి చూస్తుంటారు. ఇలాంటి వారు ప్రతీ ఒక్కరి గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ, వారి గురించి తెలియక చాలా మంది వారితో స్నేహం చేస్తారు. దీని కారణంగా తరువాతి కాలంలో వారు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఏ కారణం లేకుండానే, ప్రతి విషయంలోనూ మనసులో భయాన్ని కలిగిస్తారు. ఏదైనా మంచి చేస్తే ప్రోత్సహించే బదులు.. దానిలోని ప్రతికూలతలను వెలికితీసి చూపుతారు.

ఇతరులపై అసూయపడే వారు.. ఇతరులను చూసి అసూయపడే వారు చాలా మంది ఉన్నారు. ఎవరి విజయాన్ని, మంచిని వీరు సంతోషించరు. ఈ వ్యక్తులు తమ కష్టాల పట్ల తక్కువ అసంతృప్తిని కలిగి ఉంటారు. ఇలాంటి వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది.

ఇవి కూడా చదవండి

మానిప్యులేట్ చేసే వ్యక్తులు.. మానిప్యులేటీవ్ వ్యక్తులతో దూరంగా ఉండాలి. వారికి ఎంత దూరం ఉంటే అంత క్షేమం. వారు తమ మాటలతోనే ఇతరులను ప్రలోభపెట్టి తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటారు.

స్వంత అవసరాలు ఉన్నవారు.. స్వంత అవసరాలు ఉన్నవారు తాము కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు ఇతరులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుచేసుకుంటారు. సాధారణ సమయాల్లో మీరు ఎలా ఉన్నారని కనీసం అడగరు.

పై వ్యక్తులకు ఎలా దూరం అవాలి.. కుట్రపూరితమైన ఆలోచనలు, భావాలు ఉన్న వ్యక్తులతో ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారి మాటలే వారి వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. మీ వ్యక్తిగత విషయాలను అడగడం ద్వారా మిమ్మల్ని నియంత్రించడానికి వారు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారితో మీరు నియంత్రణతో మాట్లాడాలి. వారికి ఎక్కువ సమయం కేటాయించకండి. ఒకరి మాటలు మీకు బాధ కలిగిస్తే.. అలాంటి వారి నుంచి మెల్లగా దూరం అవ్వండి. ఆ వ్యక్తుల నుంచి మానసికంగా దూరం అవ్వండి. చెడు, దుర్భుద్దులు కలిగిన వ్యక్తుల గురించి తెలుసుకుని.. వారికి వీలైనంత దూరం పాటించండి.