Mamata Banerjee Injured: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి.. గాయాలు.. నందిగ్రామ్‌లో ఉద్రిక్తత
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై
Mamata Banerjee Injured: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై దాడి జరిగింది. కారు ఎక్కబోతున్న ఆమెపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. దీంతో మమతా నందిగ్రామ్ పర్యటనను రద్దు చేసుకొని కోల్‌కతాకు వెళ్లారు. కాలికి గాయమైందని, ఛాతినొప్పి కూడా తనను తీవ్రంగా బాధిస్తుందని మమతా పేర్కొన్నారు. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమతా తెలిపారు. దీంతో నందిగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నందిగ్రామ్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలోనూ నలుగురైదుగురు తన కారు డోర్‌ను బలవంతంగా నెట్టారని.. దీంతో తాను లోపలోనే ఉండి పోవాల్సి వచ్చిందని మమతా పేర్కొన్నారు. మీడియా ఇది కుట్రగా అభివర్ణిస్తున్నారా… అని ప్రశ్నించగా.. అవును ఇది ముమ్మాటికీ కుట్రే అంటూ మమతా ఆరోపించారు. ఘటనాస్థలంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని.. ఎస్పీ కూడా లేరు అంటూ మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదిలాఉంటే.. మమతా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఖండించారు. మమతా బెనర్జీ దాడి పేరుతో సానుభూతి సంపాదించేందుకు పాకులాడుతున్నారని పేర్కొన్నారు. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: