ఢిల్లీ అంటే ‘రామ రాజ్యమే’, నగరాన్ని అయోధ్యతో పోల్చిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ అంటే 'రామ రాజ్యమే' అని కొత్త నినాదమిచ్చారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అయోధ్యను, ఢిల్లీని పోలుస్తూ ఆయన.. వృద్దులను అయోధ్యలోని రామాలయానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
ఢిల్లీ అంటే ‘రామ రాజ్యమే’ అని కొత్త నినాదమిచ్చారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అయోధ్యను, ఢిల్లీని పోలుస్తూ ఆయన.. వృద్దులను అయోధ్యలోని రామాలయానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బుధవారం తమ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తను రాముడి ఆశయాలను పాటిస్తున్నానని, అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగాక పెద్దవారిని, వృద్దులను అయోధ్యకు తీసుకువెళ్తానని చెప్పారు. తనను రాముడి, హనుమంతుడి భక్తుడిగా చెప్పుకున్నారు. అయోధ్యకు రాముడే రాజని అంటూ ఢిల్లీలో తన పాలనలో అంతా బాగుందని తనకు తానే ప్రశంసించుకున్నారు. అసలు ఈ నగరంలో చింతలనేవే లేవని, అన్ని సౌకర్యాలూ ఉన్నాయని. దీన్నే రామ రాజ్యమని అంటారని పేర్కొన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ తనకు ఎంతో నచ్చుతుందని తెలిపారు. ఈ నగరంలో ఆహరం, విద్య, మెడికల్ కేర్, విద్యుత్, నీటి సరఫరా, ఉద్యోగాలు ఇలా అన్ని సదుపాయాలూ ఉన్నాయని ఆయన చెప్పారు. ధనికులైనా, పేదలైనా ఎవరైనా సరే మంచి నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యం ఉండాల్సిందే అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇలా తనను పరోక్షంగా రాముడిగా, ఢిల్లీ నగరాన్ని అయోధ్యతో పోలుస్తూ మాట్లాడుతుంటే సభ్యులంతా మౌనంగా ఆలకించారు. ఈ ముఖ్యమంత్రి ఇలా ఎప్పుడూ మాట్లాడలేదని కొంతమంది తమలో తాము గుసగుసలాడుకున్నట్టు సమాచారం. కాగా రైతుల నిరసనలు శాంతించడంతో ఢిల్లీ నగరం ప్రశాంతంగా ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ :
జొమాటో డెలివరీ బాయ్ దాడిలో గాయపడిన కంటెంట్ క్రియేటర్, నిందితుడి అరెస్ట
Rare Animal: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వింత జంతువు… ఈ వింత జంతువు ఏంటో మీరు గుర్తించగలరా…?
Naga Chaitanya: ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో