జొమాటో డెలివరీ బాయ్ దాడిలో గాయపడిన కంటెంట్ క్రియేటర్, నిందితుడి అరెస్ట్
బెంగుళూరులో జొమాటో డెలివరీ బాయ్ ఒకడు చేసిన దాడిలో ఓ యువతి గాయపడింది. కంటెంట్ క్రియేటర్ అయిన హితేషా చంద్రానీ అనే ఈ యువతి తనకు కలిగిన అనుభవాన్ని సోషల్ మీడియా లో వీడియో ద్వారా షేర్ చేసుకుంది.
బెంగుళూరులో జొమాటో డెలివరీ బాయ్ ఒకడు చేసిన దాడిలో ఓ యువతి గాయపడింది. కంటెంట్ క్రియేటర్ అయిన హితేషా చంద్రానీ అనే ఈ యువతి తనకు కలిగిన అనుభవాన్ని సోషల్ మీడియా లో వీడియో ద్వారా షేర్ చేసుకుంది. ఈమె తన ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకుంటూ జొమాటో నుంచి ఫుడ్ కి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆర్డర్ ఇచ్చి ఎంత సేపయినా రాకపోవడంతో కస్టమర్ కేర్ కి, జొమాటో ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసి ఇక మీ ఫుడ్ వద్దని, ఇస్తే ఫ్రీగా ఇవ్వాలని, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని హెచ్ఛరించింది. అప్పటికే తాను చాలాసార్లు కస్టమర్ కేర్ సెంటర్ కి ఫోన్ చేసి విసుగెత్తిపోయానని ఆమె తెలిపింది. చివరి సారిగా ఫోన్ చేస్తుండగా జొమాటో డెలివరీ బాయ్ వచ్చాడని, ఇంత ఆలస్యంగా వస్తే తనీ ఫుడ్ తీసుకోనని, ఆర్డర్ రద్దు చేస్తున్నానని, తీసుకువెళ్లిపొమ్మని చెప్పినట్టు ఆమె వెల్లడించింది. దీంతో ఆ బాయ్ ఆగ్రహించి దుర్భాషలాడుతూ తన ముక్కుపై దాడి చేసి పరుగెత్తి పారిపోయాడని చంద్రానీ పేర్కొంది. ఈ ఎటాక్ లో ఆమె ముక్కునుంచి రక్తం కారి తీవ్రంగా గాయపడింది. తన నాలుగు నిముషాల వీడియాలో బాధితురాలు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.
చివరకు బాధితురాలి ఫిర్యాదుతో జొమాటో యాజమాన్యం ఆమెకు క్షమాపణ చెప్పడమే గాక ఆ డెలివరీ బాయ్ పేరును యాప్ నుంచి తొలగించామని, మీమెడికల్ కేర్ కు, ఈ ఘటనపై దర్యాప్తునకు సహకరిస్తామని ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. భవిష్యత్తులో ఈ విధమైన సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. చంద్రానీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో బెంగుళూరు పోలీసులు ఆ డెలివరీ బాయ్ పై కేసు పెట్టి అరెస్టు చేశారు.
View this post on Instagram
మరిన్ని చదవండి ఇక్కడ :
పాలు పట్టుకొచ్చిన సంరక్షకులు… పరుగెత్తుకొచ్చిన ఏనుగులు… చూస్తుండగానే..