గాల్వన్‌ లోయలో మేజర్‌-జనరల్‌ స్థాయి అధికారులతో కొనసాగుతున్న చర్చలు..

గాల్వన్‌ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి.. ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు చర్చలు కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

గాల్వన్‌ లోయలో మేజర్‌-జనరల్‌ స్థాయి అధికారులతో కొనసాగుతున్న చర్చలు..
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Jun 17, 2020 | 3:53 PM

గాల్వన్‌ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి.. ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు చర్చలు కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ -జనరల్ స్థాయికి చెందిన అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్‌ లోయలో ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కల్నల్‌ సహా.. 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరోవైపు అటు చైనాకు చెందిన సైనికులు కూడా దాదాపు 43 మంది మరణించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో.. మేజర్-జనరల్ స్థాయిలో చర్చలు కొనసాగడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు పీఎంవో కార్యాలయం నుంచి ఆహ్వానం పంపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu