Accident News: ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా యావల్ తాలూకాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

Accident News:   ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2021 | 8:31 AM

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా యావల్ తాలూకాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

యావల్ తాలూకాలోని కింగ్వాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి ఒంటి గంట సమయంలో,   యవల్ చోప్రా రోడ్‌లోని ఒక మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ బోల్తా పడింది. సదరు ట్రక్ బొప్పాయి పంటను మార్కెట్‌కు తీసువెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ట్రక్కులో నింపిన బొప్పాయి పంటపైన ప్రాణాలు కోల్పోయిన కూలీలు కూర్చున్నాడు. ఈ రహదారిలో చాలా గుంతలు ఉండటం వల్లే ట్రక్ బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జల్గావ్, యావల్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. బోల్తాపడిన ట్రక్కును క్రేన్ సహాయంతో సరిచేశారు. అనంతరం కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన ఇద్దరు ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: