Suicide Attacks: ఆత్మాహుతి దాడులతో.. అమిత్ షా, యోగిని చంపుతాం.. సీఆర్‌పీఎఫ్‌కు మెయిల్..
Mail threatening to kill Yogi Adityanath, Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామంటూ
Mail threatening to kill Yogi Adityanath, Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈ మెయిల్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్‌కు మంగళవారం ఉదయం ఈ ఈమెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతి దాడుల ద్వారా అమిత్ షా, యోగిని చంపేస్తామంటూ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా దాడులు చేస్తామని హెచ్చరిస్తూ మెయిల్‌లో పేర్కొ్నారు. 11 సూసైడ్ బాంబర్ల ద్వారా ఈ దాడులు చేస్తామంటూ మెయిల్ లో రాశారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: