AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: రాజకీయాల్లో సంచలనం.. 20 ఏళ్ల తరువాత హిందీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌..

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. 20 ఏళ్ల తరువాత ఏకమయ్యేందుకు ఠాక్రే బ్రదర్స్‌ ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాజ్‌ ఠాక్రే , ఇటు ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని ఠాక్రే బ్రదర్స్‌ ప్రకటించారు.

Maharashtra: రాజకీయాల్లో సంచలనం.. 20 ఏళ్ల తరువాత హిందీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌..
Uddhav Thackeray Raj Thackeray
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2025 | 8:50 AM

Share

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. 20 ఏళ్ల తరువాత ఏకమయ్యేందుకు ఠాక్రే బ్రదర్స్‌ ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాజ్‌ ఠాక్రే , ఇటు ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని ఠాక్రే బ్రదర్స్‌ ప్రకటించారు. త్రిభాషా సిద్దాంతానికి తాము వ్యతిరేకమని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తప్పుపట్టారు.

రాజకీయ ప్రయోజనాల కంటే తమకు మహారాష్ట్ర సాంస్కృతిక , భాష వారసత్వమే ముఖ్యమని అంటున్నారు ఇద్దరు నేతలు. శివసేన ఉద్దవ్‌ వర్గం, మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన లక్ష్యాలు ఒక్కటే అయినప్పటికి ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని అన్నారు రాజ్‌ ఠాక్రే.

ఉద్దవ్‌ ఠాక్రేతో తనకు ఉన్న విభేదాలు చాలా చిన్నవన్నారు రాజ్‌ ఠాక్రే. మహారాష్ట్ర ప్రయోజనాలు దీని కంటే ముఖ్యమన్నారు. వ్యక్తిగత స్వార్ధం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలు ఏకం కావాలన్నారు రాజ్‌ ఠాక్రే. తమంతా హిందువులమే కాని … హిందీ కాదంటూ పేర్కొన్నారు.

‘‘ఇది కష్టమైన పనికాదు.. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. నా స్వార్ధం కోసం మాట్లాడడం లేదు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం.. మహారాష్ట్ర లోని పార్టీలన్నీ ఏకం కావాలి. షిండే తిరుగుబాటుకు నేను పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి చాలా తేడా ఉంది. బాలాసాహేబ్‌ మీద గౌరవంతో నేను ఒక్కడినే బయటకు వెళ్లా ’’ అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు.

కాగా.. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలపై స్పందించారు ఉద్దవ్‌ ఠాక్రే. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్దమంటూ సంకేతాలిచ్చారు.. ‘‘మహారాష్ట్ర నేతలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాని లోక్‌సభ ఎన్నికల సమయంలో గుజరాత్‌కు మహారాష్ట్ర కంపెనీలు తరలివెళ్తుంటే మనం చేశాం .. ఆలోచించుకోవాలి.’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..