బిగ్ బ్రేకింగ్ : చేతులెత్తేసిన బీజేపీ.. ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోడానికి కొన్ని గంటల ముందే తన రాజీనామా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఫడ్నవీస్.. శివసేన కన్నా.. బీజేపీకి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, తమ ఎమ్మెల్యేలు 105 మంది గెలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా శివసేనపైన విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బహిరంగంగా బేరసారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ఈ […]
మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోడానికి కొన్ని గంటల ముందే తన రాజీనామా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఫడ్నవీస్.. శివసేన కన్నా.. బీజేపీకి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, తమ ఎమ్మెల్యేలు 105 మంది గెలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా శివసేనపైన విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బహిరంగంగా బేరసారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రొటేషనల్ పదవికి సంబంధించి తాము శివసేనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల వ్యూహం.. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టాలన్నదేనని విమర్శించారు. మాకు మెజార్టీ లేదని చెప్పిన ఆయన.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. శివసేనకు తామేమి ఎలాంటి హామీలు ఇవ్వలేదని.. పునరుద్ఘాటించారు. తాను గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపారు. శివసేన చెప్పుకుంటున్న హిందుత్వ నినాదం సోనియా ముందు మోకరిల్లిందని ఫడ్నవీస్ మండిపడ్డారు.