AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పళ్లు తోముకుంది.. ప్రాణాలు పోగొట్టుకుంది..!

కర్నాటకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలుకల మందు పేస్టును.. టూత్ పేస్ట్‌గా భావించి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని మాల్పేలో ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. బ్రష్ చేసుకుంది. అయితే టూత్ పేస్ట్, ఎలుకల మందుకు సంబంధించిన విషం రెండూ ఒకే రకంగా ఉండడాన్ని ఆమె గమనించలేదు. ఎలుకల మందుకు సంబంధించిన పేస్ట్‌ వంటిదాన్ని బ్రష్‌కు వాడటంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారం […]

పళ్లు తోముకుంది.. ప్రాణాలు పోగొట్టుకుంది..!
Pardhasaradhi Peri
|

Updated on: Nov 26, 2019 | 9:00 PM

Share

కర్నాటకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలుకల మందు పేస్టును.. టూత్ పేస్ట్‌గా భావించి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని మాల్పేలో ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. బ్రష్ చేసుకుంది. అయితే టూత్ పేస్ట్, ఎలుకల మందుకు సంబంధించిన విషం రెండూ ఒకే రకంగా ఉండడాన్ని ఆమె గమనించలేదు. ఎలుకల మందుకు సంబంధించిన పేస్ట్‌ వంటిదాన్ని బ్రష్‌కు వాడటంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారం రోజులపాటు చికిత్స పొందిన ఆమె.. చివరకు ఆదివారం రోజు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. టూత్ పేస్ట్ బదులుగా ఎలుకల మందు ఉపయోగించడంతోనే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us