Maharashtra Political Crisis: గవర్నర్ కోర్టులో బంతి.. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పావులు కదుపుతున్న బీజేపీ..
సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దొరకడంతో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఇవాళ గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరనుంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం మహా రంజుగా మారుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేసిన బీజేపీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దొరకడంతో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఇవాళ గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరనుంది. ఇందులోభాగంగా ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు ఫడ్నవిస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతోపాటు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం మైనార్టీలో పడిందని.. తక్షణమే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తనకు 51 ఎమ్మెల్యేల బలం ఉందంటున్నారు షిండే. బల నిరూపణకు గవర్నర్ కోష్యారి అవకాశమిస్తే ముంబై వస్తామంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు.
దీంతోపాటు కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. బలనిరూపణకు గవర్నర్ అవకాశమిస్తే ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అనర్హత వేటు ప్రక్రియను సుప్రీంకోర్టు నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత, కాంగ్రెస్, ఎన్‌సిపి సీనియర్ నాయకులు సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిసి పరిస్థితులపై చర్చించారు. బల నిరూపణకు అంగీకరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాట్లాడారు.
కాగా.. 15-20 మంది తిరుగుబాటు సేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు, వారిని తిరిగి ముంబైకి తీసుకురావాలని తమను కోరిని మంత్రి ఆదిత్య థాకరే పేర్కొన్నారు. తిరుగుబాటు శిబిరంలోని వారితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. శివసేన ఎమ్మెల్యేలు హోటల్‌లో ఉంచిన గౌహతి నుంచి తిరిగి ముంబైకి తీసుకురావాలని కోరుతున్నట్లు ఆదిత్య ఠాక్రే సోమవారం పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు MVA ప్రభుత్వాన్ని పెద్ద సంక్షోభంలోకి పడేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..