AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశం చూపు ఏపీ వైపు.. జగన్‌ను ఫాలో అవుతోన్న ‘మహా సీఎం’

ఏపీ సీఎం జగన్ చేసిన పని.. ఏకంగా మరో రాష్ట్ర సీఎంనే ఫాలో అయ్యేలా చేసింది. అంతేకాదు.. దేశం మొత్తం ఇప్పుడు ఏపీ వైపే చూస్తోంది. మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా..

దేశం చూపు ఏపీ వైపు.. జగన్‌ను ఫాలో అవుతోన్న 'మహా సీఎం'
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 26, 2020 | 6:58 AM

Share

ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. ఏకంగా మరో రాష్ట్ర సీఎంనే ఫాలో అయ్యేలా చేసింది. అంతేకాదు.. దేశం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ‘దిశ పోలీస్ స్టేషన్’లను కూడా ప్రారంభించారు.

అత్యాచార కేసుల్లో నిందితులకు 21 రోజుల్లోనే మరణ శిక్షలు విధించేందుకు నిర్థేశించిన దిశ చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా దిశ యాక్ట్‌ని తీసుకొచ్చే విధంగా.. ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే దృష్టి సారించారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించారు. మార్చి 30వ తేదీ లోపు నివేదిక అందజేయాలని సీఎం వారిని ఆదేశించినట్టు హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన దిశ చట్టాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దేశ్ ముఖ్ గతంలో చెప్పారు. దిశ చట్టాన్ని.. మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించడానికి, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష పడే విధంగా రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే.. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు పరిచేలా ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్