AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag Motivational Quotes: ఒత్తిడిలో ఉన్నారా?..సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు చదివితే విజయం మీదే

Virender Sehwag Motivational Quotes: భయం లేకపోవడం అంటే ఏంటో సెహ్వాగ్ ఆచరణలో చూపించాడు. 295 పరుగుల వద్ద ఉన్నప్పుడు సాధారణ బ్యాటర్లు కంగారుపడతారు. కానీ సెహ్వాగ్ ఏకంగా సిక్స్ కొట్టి త్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. సొంత టాలెంటు పై ఉన్న అపారమైన నమ్మకమే ఈ సాహసానికి పునాది.

Virender Sehwag Motivational Quotes: ఒత్తిడిలో ఉన్నారా?..సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు చదివితే విజయం మీదే
Virender Sehwag
Rakesh
|

Updated on: Aug 18, 2026 | 12:33 PM

Share

Virender Sehwag Motivational Quotes:క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రయాణం ఎన్నో సవాళ్లతో నడిచింది. క్రీడా మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని జయించి, విజయం ఎలా సాధించాలో చెప్పే సెహ్వాగ్ లైఫ్ లెసన్స్ ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి.

పాత ఆలోచనలను తిరగరాయడం.. స్వశక్తిని నమ్ముకోవడం

క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సెహ్వాగ్ గురించి ఎన్నో ప్రతికూల కామెంట్లు వచ్చాయి. ‘కాల్లు కదపలేడు, ఎక్కువ కాలం నిలబడలేడు’ అన్న విమర్శలను ఆయన తన బ్యాట్‌తోనే తిప్పికొట్టాడు. పాతకాలపు నమ్మకాలను బద్దలు కొడుతూ నిలబడిన చోటు నుంచే తిరుగులేని త్రిపుల్ సెంచరీ సాధించి చూపించాడు. టాలెంట్ ముందు మూస పద్ధతులు పనిచేయవని నిరూపించాడు. ‘సొంత కాళ్లపై నిలబడి పేరు తెచ్చుకునే సత్తా ఉన్నప్పుడు ఇతరుల సహాయం ఎందుకు? దమ్ముంటే నీ పేరు నువ్వే బిల్డ్ చేసుకో’ అని సెహ్వాగ్ గట్టిగా నమ్ముతాడు.

భయానికి చెక్.. 295 పరుగుల వద్ద సిక్స్

భయం లేకపోవడం అంటే ఏంటో సెహ్వాగ్ ఆచరణలో చూపించాడు. 295 పరుగుల వద్ద ఉన్నప్పుడు సాధారణ బ్యాటర్లు కంగారుపడతారు. కానీ సెహ్వాగ్ ఏకంగా సిక్స్ కొట్టి త్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. సొంత టాలెంటు పై ఉన్న అపారమైన నమ్మకమే ఈ సాహసానికి పునాది. ఒత్తిడిని జయించడానికి ఆయన ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైండ్ లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటానికి పాటలు పాడేవాడు. ప్రతి ఒక్కరికీ భయాన్ని జయించడానికి ఒక ప్రత్యేకమైన దారి ఉంటుందని, దానిని కనిపెట్టడమే ముఖ్యమని ఆయన చెబుతాడు.

ఇది కూడా చదవండి: IND vs SL: భారత్-శ్రీలంక టెస్టులో విషాదం.. స్టార్ ప్లేయర్‌ మెడకు తీవ్ర గాయం  

అనుభవం, క్రమశిక్షణే విజయానికి అసలైన సూత్రాలు

క్రికెట్‌లో సవాళ్లను ఎదుర్కోవాలన్నా, జీవితంలో ఒత్తిడిని జయించాలన్నా అనుభవం ఎంతో సహాయపడుతుందని సెహ్వాగ్ అంటాడు. మీ ఆట లేదా మీ పనిపై స్పష్టమైన అవగాహన ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సులువుగా ఎదుర్కోవచ్చు. క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ మనిషిని అద్భతుంగా మారుస్తుంది. మనిషి సహజమైన నైజం ఎప్పటికీ మారదని, దానిని సరిచేసుకోవడం ద్వారా మాత్రమే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అంటాడు. సెహ్వాగ్ భారత్ తరఫున రెండు త్రిశతకాలు చేసిన ఏకైక బ్యాటర్‌గా, వన్డే నాయకుడిగా 219 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: Rishabh Pant: టీమిండియా టెస్ట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్

ఆనందం డబ్బులో లేదు.. మనస్తత్వంలో ఉంది

జీవితంలో ఆనందంగా ఉండటానికి కోట్లు అవసరం లేదని సెహ్వాగ్ తేల్చి చెప్పారు. ‘గతంలో నెలకు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఆరుగురం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత వెయ్యి, పదివేలు, లక్షలు చివరికి కోట్లకు చేరినా సంతోషం మాత్రం మారలేదు’ అని ఆయన గుర్తుచేసుకుంటారు. మనం సంపాదించే డబ్బులో సంతోషం ఉండదని, అది మన అంతర్గత భావనపై మాత్రమే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మన సామర్థ్యంపై నమ్మకం ఉంచితే సాధించలేనిది ఏదీ లేదని వీరూ మాటలు నిరూపిస్తాయి.

సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు కేవలం క్రికెటర్లకే కాకుండా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ అద్భుతమైన దిశానిర్దేశం చేస్తాయి. ఒత్తిడిని జయించి ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us