మళ్ళీ మరో సంచలనం… ! ముంబై మాజీ పీసీ పరమ్ బీర్ సింగ్ మరో లెటర్ ‘బాంబ్ ‘.. ఈ సారి ఎవరి పైనంటే ?
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఈ సారి మరో 'లెటర్ బాంబ్' పేల్చారు. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే పైనే తన అస్త్రాన్ని ఆయన ఎక్కుపెట్టారు.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఈ సారి మరో ‘లెటర్ బాంబ్’ పేల్చారు. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే పైనే తన అస్త్రాన్ని ఆయన ఎక్కుపెట్టారు. రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై నీ ఫిర్యాదును, సీఎం ఉద్దవ్ థాక్రేకి నువ్వు రాసిన లేఖను ఉపసంహరించుకుంటే నీపై గల డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీలను సెటిల్ చేస్తానని సంజయ్ పాండే ప్రలోభ పెట్టారని సింగ్… సీబీఐకి లేఖ రాశారు. అనిల్ దేశ్ ముఖ్ పై జరుగుతున్న దర్యాప్తును నీరు గార్చడానికి రాష్ట్రంలోని అధికారులు కొందరు ప్రయత్నిస్తున్నారని, పైగా సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి కూడా యత్నిస్తున్నారని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు.నెలకు 100 కోట్లను ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేయాలని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని గతంలో పరమ్ బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి రాసిన లేఖలో ఆరోపించిన విషయం గమనార్హం. చివరకు ఈ వ్యవహారంతో దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సింగ్.. బాంబే హైకోర్టును కోరడం, కోర్టు ఆదేశాలతో ఈ దర్యాప్తు సంస్థ ఆయనపై ఇన్వెస్టిగేషన్ కి పూనుకోవడం తెలిసిందే.
డీజీపీ సంజయ్ పాండే తనను తన కార్యాలయానికి పిలిపించారని, మాటల సందర్భంలో అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ ఎంక్వయిరీ గురించి ప్రస్తావించారని సింగ్ తన లేఖలో తెలిపారు. తాను ఏదో చెప్పబోగా.. మొదట నువ్వు ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని, అప్పుడు సీబీఐ దర్యాప్తు నిష్ప్రయోజనమవుతుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు. మువ్వు ఇలా చేస్తే నీపై శాఖాపరంగా గల ఎంక్వయిరీ విషయాన్ని సెటిల్ చేస్తానని ప్రలోభ పెట్టారన్నారు. తాను ఆయనతో జరిపిన సంభాషణను సింగ్ రికార్డు చేశారు కూడా.
మరిన్ని ఇక్కడ చూడండి: Remdesivir Medicine: రెమిడెసివిర్ కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
????????? ???????????: డ్యాన్స్ తో అదరగొట్టిన ‘జయమ్మ’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో