AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Remdesivir Medicine: ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో..

Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Remdesivir
Subhash Goud
|

Updated on: Apr 30, 2021 | 8:26 PM

Share

Remdesivir Medicine: ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కరోనా చికిత్సలో ఈ రెమిడెసివిర్‌ కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీని కొరత పెరిగిపోతోంది. అయితే ఈ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రగ్‌ను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

4.5 లక్షల డోస్‌ల రెమిడెసివిర్‌ను పలు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్‌ ఈ రోజు భారత్‌కు రానున్నాయి. దేశీయ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా సంస్థల నుంచి ఈ డ్రగ్‌ను కొనుగోలు చేయనుంది. అలాగే దేశీయంగా కూడా దీని ఉత్పత్తిని పెంచే విధంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏడు దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి. ఈ డ్రగ్‌కు భారీ డిమాండు ఉన్నందున కొరతను నివారించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఇవీ కూడా చదవండి:

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా