????????? ???????????: డ్యాన్స్ తో అదరగొట్టిన ‘జయమ్మ’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
జనరల్‌గా ఓ హీరో కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. కాని ఈ అమ్మడు మాత్రం....
జనరల్‌గా ఓ హీరో కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. కాని ఈ అమ్మడు మాత్రం మాంచి లేడీ విలన్‌గా.. వర్సటైల్ యాక్టరస్‌గా పేరు తెచ్చుకువాలని తెగ ట్రైచేస్తుంది. ట్రై చేయడమే కాదు.. అలాంటి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎస్ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఇంకెవరు వరలక్ష్మీ శరత్ కుమార్.
యస్.. క్యారెక్టర్ ఏదైన అందులో లీనం అయిపోయి.. అందర్నీ మెప్పించే వరలక్ష్మీ.. రవితేజ్ క్రాక్ సినిమాతో.. జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అందరినీ తన విలనిజంతో ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా వచ్చిన నాంది సినిమాలో ఓ పవర్‌ఫుల్ లాయర్‌గా నటించి శభాష్ అనిపించుకుంది.
ఇలా నటనలోనే డ్యాన్సింగ్‌లోనూ.. తెగ ఇంట్రెష్ట చూపించే ఈ అమ్మడు రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేయడమే కాదు.. డ్యాన్స్ అంటే ప్రీడమ్ అని.. తన మోస్ట్ డిఫికల్ట్ సిట్యువేషన్స్ లో డ్యాన్సే తనకు అండగా ఉందని.. డ్యాన్స్ మీలోని ట్రెజర్.. అని రాసుకొచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Dance is freedom..It has always been there for me through my most difficult times..treasure yourself.. dance when u can even if ur alone laugh to yourself enjoy your life while you can, cos no one knows what tomm holds.!!! Happpyyyy danceeee dayyyy..!#Happyinternationaldanceday pic.twitter.com/mJc2grH4gb
— ????????? ??????????? (@varusarath5) April 29, 2021
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..