మహారాష్ట్రలో కోవిడ్ విలయం, ఒక్కరోజే 66,836 కేసులు నమోదు, మృతుల సంఖ్య ఎంతంటే ?

మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 66,836 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 773 మంది కరోనా రోగులు మృతి చెందారు.  కేవలం ఒక్క రోజులో ఇంత 'ఉత్పాతం' సంభవించడం...

మహారాష్ట్రలో కోవిడ్ విలయం, ఒక్కరోజే 66,836 కేసులు నమోదు, మృతుల సంఖ్య ఎంతంటే ?
Second Covid Wave
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 24, 2021 | 7:51 AM

మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 66,836 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 773 మంది కరోనా రోగులు మృతి చెందారు.  కేవలం ఒక్క రోజులో ఇంత ‘ఉత్పాతం’ సంభవించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,91,851కి చేరుకుంది. అసలే ఆక్సిజన్, ప్రాణాధార మందులు లేక సతమతమవుతున్న మహారాష్ట్రలో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. తమ రాష్ట్రానికి వెంటనే ఆక్సిజన్ కోటాను పెంచాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే..ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఇక ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 348 మంది కరోనా రోగులు మరణించారు. కొత్తగా 24,331 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 32 శాతం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నగరంలో యాక్టివ్ కేసులు 92 వేలు ఉన్నట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ పలు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి.

దేశంలో నిన్న  3,32,730 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజురోజుకీ పెరుగుతున్న కోవి డ్ కేసులు పలు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాల సర్వీసులను కుదించాయి,. నిన్నటికి నిన్న న్యూజిలాండ్ కూడా ఇండియా నుంచి వచ్చే  విమాన ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లాలని సూచించింది, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత విమానాలపై ఆంక్షలు విధించాయి. అయితే జర్మనీ నుంచి మన దేశానికి 23 ఆక్సిజన్ కంటేయినర్లు విమానాల ద్వారా దిగుమతి కావడం  ఊరట కలిగించే విషయం.