AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SWAMITVA scheme: ఆ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ.. స్వామిత్వ పథకం కింద ఈ-ప్రాపర్టీ కార్డులకు ప్రదాని మోదీ శ్రీకారం

జాతీయ పంచాయతీ డే సందర్భంగా‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

SWAMITVA scheme: ఆ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ.. స్వామిత్వ పథకం కింద ఈ-ప్రాపర్టీ కార్డులకు ప్రదాని మోదీ శ్రీకారం
Pm Modi
Balaraju Goud
|

Updated on: Apr 24, 2021 | 8:55 AM

Share

జాతీయ పంచాయతీ డే సందర్భంగా‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీకి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 4.09లక్షల ఆస్తి యజమానులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొననున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులను సైతం ప్రధాని ప్రదానం చేయనున్నారు.

224 పంచాయతీలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరన్‌ పురస్కార్‌ అవార్డులు, 30 పంచాయతీలకు నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కార్‌ , 30 పంచాయతీలకు చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డులు,12 రాష్ట్రాలకు ఈ పంచాయతీ పురస్కార్‌ అవార్డులను ప్రధాని ప్రదానం చేయనున్నారు. అలాగే, ఈ సందర్భంగా ప్రధాని అవార్డు ప్రైజ్‌మనీని సైతం పంచాయతీ బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయనున్నారు. మొదటిసారిగా విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఒక బటన్ క్లిక్ ద్వారా అవార్డు డబ్బును (గ్రాంట్-ఇన్-ఎయిడ్ గా) రూ .5 లక్షల నుండి రూ .50 లక్షల వరకు బదిలీ చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత పంచాయతీల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాలలో సర్వే , గ్రామాల్లో మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ కోసం స్వశక్తికరన్‌ పథకం ఉద్దేశించబడింది. ఈ పథకాన్ని 2020 ఏప్రిల్ 24 న కేంద్ర-ఆర్థిక పథకంగా ప్రారంభించారు. సామాజిక-ఆర్ధికంగా సాధికారిక, స్వావలంబన దిశగా గ్రామీణ భారతదేశాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రంగ పథకంగా ప్రారంభించారు.మ్యాపింగ్ మరియు సర్వేయింగ్ యొక్క ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించి గ్రామీణ భారతదేశాన్ని మార్చగల సామర్థ్యం ఈ పథకానికి ఉంది. రుణాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి గ్రామస్తులు ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించుకోవడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.ఈ పథకం 2021-2025లో మొత్తం దేశంలోని 6.62 లక్షల గ్రామాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2020-2021లో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా మహారాష్ట్ర , కర్ణాటక, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ గ్రామాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.

Read Also…  మహారాష్ట్రలో కోవిడ్ విలయం, ఒక్కరోజే 66,836 కేసులు నమోదు, మృతుల సంఖ్య ఎంతంటే ?