Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు… తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో రోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు... తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..
Coronavirus.
Follow us
Subhash Goud

|

Updated on: Apr 22, 2021 | 11:04 PM

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో రోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మాత్రం తీవ్ర రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం కొత్తగా 67,013 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 568 మంది మృతి చెందినట్లు తెలిపింది. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం కఠినమైన ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు లాక్‌డౌన్ విధించింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి మే1 ఉదయం 7 గంటల వరకు ఈ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏప్రిల్‌ 22 రాత్రి 8 నుంచి మే1 ఉదయం 7 వరకు కఠినమైన ఆంక్షలు

పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాలయాలపై ఆంక్షలు విధించింది. ఒకే హాల్‌లో ఒకే వేడుకగా నిర్వహించాలి. పెళ్లిళ్లకు 25 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదు. అలాగే వేడుక రెండు గంటల్లోగా పూర్తి కావాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే 50వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 50శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. సిటీల్లో రెండు కంటే ఎక్కువ చోట్ల ఆపకూడదు. ప్రయాణికులు దిగే సమయంలో 14 రోజుల క్వారంటైన్ స్టాంప్ వేయాలి.

Corona Vaccine: రూ. 400 కోట్లతో కోటి డోసుల టీకాలు కొనుగోలు చేస్తాం : కర్ణాటక ముఖ్యమంత్రి

Bengaluru Volunteers: కరోనా మృతదేహాలకు ఆ నలుగురే.. అన్ని మతాల సాంప్రదాయాలతో అంత్యక్రియలు