Corona Cases: ఆ రాష్ట్రంలో కొత్తగా 6,112 పాజిటివ్‌ కేసులు నమోదు.. ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు

Corona Cases: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో అధికంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదయ్యే ...

Corona Cases: ఆ రాష్ట్రంలో కొత్తగా 6,112 పాజిటివ్‌ కేసులు నమోదు.. ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2021 | 8:56 PM

Corona Cases: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో అధికంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదయ్యే జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అయితే కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఇక తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,112 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 44 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,87,632కు చేరగా, మరణాల సంఖ్య 51,713కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేస్‌ తోపేకు కూడా కరోనా పాజిటివ్‌ తేలింది. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో 51,713 యాక్టివ్‌ కేసులు ఉంది. అలాగే రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 19,89,963కు చేరింది.ఇక కరోనా కేసులు పెరగడంతో అమరావతి, యావత్మాల్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేశారు. శనివారం నుంచి అమరావతిలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

కాగా, ఇప్పటికే పాజిటివ్‌ కేసులను తగ్గించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. ఏ మాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే.. మహారాష్ట్రలో పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తూ గట్టెక్కే పరిస్థితి ఉంటుందని, లేకపోతే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: COVID-19 Testing: ఆ దేశాల నుంచి వస్తే కరోనా పరీక్షుల తప్పనిసరి: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?