Revenge: పట్టుమని 15 ఏళ్లైనా లేవు.. వ్యక్తిపై పగ పెంచుకుని అతని కూతురుని ఏం చేశాడంటే..

తనతో గొడవ పడిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు దారుణాతి దారుణానికి ఒడిగట్టాడు 15 ఏళ్ల బాలుడు. అతని 9 ఏళ్త కూతురుని ఎత్తుకి అత్యాచారం చేశాడు.

Revenge: పట్టుమని 15 ఏళ్లైనా లేవు.. వ్యక్తిపై పగ పెంచుకుని అతని కూతురుని ఏం చేశాడంటే..
Revenge
Follow us

|

Updated on: Dec 02, 2022 | 5:18 PM

తనతో గొడవ పడిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు దారుణాతి దారుణానికి ఒడిగట్టాడు 15 ఏళ్ల బాలుడు. అతని 9 ఏళ్త కూతురుని ఎత్తుకి అత్యాచారం చేశాడు. ఆపై అత్యంత దారుణంగా హింసించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వెలుగు చూసింది. గురువారం తెల్లవారుజామున కళ్యాణ్ వెస్ట్ రెసిడెన్షియల్ సొసైటీ ఆవరణలో తొమ్మిదేళ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యాచారంగా గుర్తించారు. చిన్నారి మృతదేహం లభించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడు ఎవరో కనిపెట్టారు.

పట్టుమని 15 ఏళ్లు అయినా నిండని పిల్లాడు.. ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. అతను ఇలా చేయడానికి గల కారణం తెలుసుకుని మరింత కంగుతిన్నారు. సిసి కెమెరాలో హత్య చేసిన బాలుడు కనిపించగా.. స్థానికులను విచారించడంతో అతన్ని ఈజీగా పట్టుకున్నారు పోలీసులు. అనంతరం అతన్ని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అది విని పోలీసులే నిర్ఘాంతపోయారు.

అంతకే ఆ పిల్లాడు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా.. రెండు రోజుల క్రితం చిన్నారి తండ్రి ఆ పిల్లాడితో గొడవ పడ్డాడు. అతన్ని కొట్టాడు. దాంతో ఆ వ్యక్తిపై బాలుడు పగతో రగిలిపోయాడు. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అతనిని ఏమీ చేయలేననే భావనకు వచ్చిన పిల్లాడు.. అతని కూతురుపై కన్నేశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. రెసిడెన్షియల్ ఏరియాలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు బాలుడు. ఆపై విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు బ్లేడ్‌తో చిన్నారి గొంతును కోసేశాడు. దాంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం బాలిక మృతదేహాన్ని అక్కడే విడిచి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లైంగిక నేరాల కింద కేసు నమోదు చేశారు. అతన్ని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..