Chhattisgarh: ఛత్తీస్‌గడ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన గని.. ఏడుగురు మృతి, మరికొందరికి గాయాలు..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్‌లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా గని కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా కూలీలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ఘోర ప్రమాదం జరిగింది. సున్నపురాయి గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలు సజీవసమాధయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలే ఉండటం.. తీవ్ర విషాదాన్ని నింపింది. బస్తర్ జిల్లా కేంద్రమైన జగదల్‌పూర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాలేగావ్ పంచాయతీలోని చుయ్ గనిలో తవ్వకాలు జరుపుతుండగా.. ఒక్కసారిగా గని కుప్పకూలి.. పనిచేస్తున్న కూలీలపై పడింది.
ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 15 మందికి పైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. సున్నపురాయి గనిలో ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కూలీల కుటుంబాలకు 4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.




చనిపోయిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని.. గనిలో చిక్కుకున్న మిగిలిన కూలీలు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
