Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రధాని.. త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం..!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి 5) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగంలో పవిత్ర స్నానం అచరించారు. ఇక్కడ ప్రధాని మోదీ దాదాపు అరగంట పాటు స్నాన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

PM Modi: అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రధాని.. త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం..!
Pm Modi In Maha Kumbh Mela
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 05, 2025 | 12:39 PM

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

Pm Modi In Maha Kumbhmela

Pm Modi In Maha Kumbhmela

ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్తారు. అరైల్ ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్‌ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Pm Modi In Maha Kumbh

Pm Modi In Maha Kumbh

ఇక జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.

అంతకుముందు, ప్రధాని మోదీ 2024 డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహా కుంభమేళా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…