AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: బాలికలకు శృంగార సమ్మతి వయసు తగ్గించాలన్న హైకోర్టు..

మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సామాజిక మాధ్యమాల యుగంలో బాలబాలికలకు 14 ఏళ్లకే యుక్త వయసు వస్తుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

High Court: బాలికలకు శృంగార సమ్మతి వయసు తగ్గించాలన్న హైకోర్టు..
Court
Aravind B
|

Updated on: Jul 02, 2023 | 6:37 PM

Share

మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సామాజిక మాధ్యమాల యుగంలో బాలబాలికలకు 14 ఏళ్లకే యుక్త వయసు వస్తుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడొచ్చని తెలిపింది. అయితే 2020లో ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడంటూ ఓ యువకుడిపై గతంలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం జూన్ 27 న ఈ కేసును కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ బాలిక ఓ వ్యక్తి వద్ద ట్యూషన్ చెప్పించుకునేది. అతను ఓ రోజు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనను అత్యాచారం చేసి వీడియో కూడా తీశాడని ఆ బాలిక తెలిపింది.

అలాగే దాన్ని చూపించి బెదిరిస్తూ తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాలికకు మరో సన్నిహిత బంధువుతో కూడా శారీరక సంబంధం ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్లకే పెద్దరికం వస్తోందని.. హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ తెలిపారు. తక్కువ వయసులోనే బాలబాలికలు శారీరక ఆకర్షణలకు గరువుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉన్నప్పటికీ బాలురు మాత్రమే నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును తగ్గించడం వల్ల బాలురను కాపడవచ్చని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..