Junior Doctors Resign: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల షాక్.. తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ 3 వేల మంది వైద్యుల రాజీనామా

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వైద్యులు ఝలక్ ఇచ్చారు.. దాదాపు 3వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపింది.

Junior Doctors Resign: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల షాక్.. తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ 3 వేల మంది వైద్యుల రాజీనామా
Madhya Pradesh 3,000 Junior Doctors Resign
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 04, 2021 | 3:25 PM

Madhya Pradesh Junior Doctors Resign: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వైద్యులు ఝలక్ ఇచ్చారు.. దాదాపు 3వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె బాటపట్టారు. ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో డాక్టర్ల నిర్ణయాన్ని భోపాల్ హైకోర్టు తప్పుబట్టింది. జూనియర్ వైద్యులు 24 గంటల్లో తిరిగి విధుల్లో చేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం ఆదేశించింది. నాలుగు రోజుల వైద్యుల సమ్మెను చట్టవిరుద్ధం అని కోర్టు పేర్కొంది.

హైకోర్టు తీర్పుతో షాక్‌కు గురైన జూడాలు దాదాపు 3 వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది జూనియర్ వైద్యులు గురువారం తమ పోస్టులకు రాజీనామా చేశారు.

తమ రాజీనామాలను ఆయా కాలేజీల డీన్‌లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎంపీజేడీఏ) అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా తెలిపారు. గత సోమవారం ప్రారంభమైన సమ్మె వారి డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని ఎంపీజేడీఏ తేల్చి చెప్పింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సంక్రమిస్తే తమకు, తమ కుటుంబాలకు స్టయిఫండ్ పెంచాలని, ఉచిత చికిత్స అందించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగటాన్ని ధర్మాసనం ఖండించింది.

Read Also….  When Sleep Hurts: నులక, పట్టె మంచాలు వాడితే వెన్నె నొప్పి, గర్భాశయ ఇబ్బందులు రావా..మన పూర్వీకులుశాస్త్రవేత్తలేనా..!