Actress Neha Sharma: తండ్రి కోసం ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బాలీవుడ్ నటి నేహా శర్మ..
చిరుత మూవీ ఫేమ్, బాలీవుడ్ నటి నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మెరిశారు. తన తండ్రి అజిత్ శర్మ తరుఫున రోడ్ షో నిర్వహించారు. బీహార్‌లోని భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ ఎన్నికల బరిలో నిలిచారు. రెండో దశలో పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అజిత్ శర్మ కుమార్తె బాలీవుడ్ నటి నేహా శర్మ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

చిరుత మూవీ ఫేమ్, బాలీవుడ్ నటి నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మెరిశారు. తన తండ్రి అజిత్ శర్మ తరుఫున రోడ్ షో నిర్వహించారు. బీహార్‌లోని భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ ఎన్నికల బరిలో నిలిచారు. రెండో దశలో పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అజిత్ శర్మ కుమార్తె బాలీవుడ్ నటి నేహా శర్మ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేహా శర్మ తన తండ్రి కోసం రోడ్ షో చేసి ప్రజల నుండి ఓట్లు కోరారు. బీహార్, భాగల్‌పూర్, బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియాలోని ఐదు జిల్లాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఒకవైపు భాగల్‌పూర్‌లో ఎన్డీయే అభ్యర్థి అజయ్ మండల్ తన ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నటి నేహా శర్మ తన తండ్రి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో అజిత్ శర్మ విజయం సాధించారు. సోమవారం షెర్మారీ చౌక్ నుంచి ప్రారంభమైన రోడ్ షో కహల్‌గావ్ వరకు సాగింది. ఈ రోడ్ షోలో నటి నేహా శర్మను చూసేందుకు వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం చాలా శ్రమించాల్సి వచ్చింది.
‘చిరుత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి నేహా శర్మ తన తండ్రి అజిత్ శర్మతో కలిసి థార్‌పై రైడింగ్ చేస్తూ భాగల్‌పూర్ పీర్‌పైంటిలోని షెర్మారీ నుండి రోడ్ షోను ప్రారంభించారు. నేహా శర్మ భాగల్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. అయితే అనుహ్యంగా ఆమె తండ్రి అజిత్ శర్మకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో తండ్రి తరుఫున ఎన్నికల ప్రచారం చేపట్టారు నేహా శర్మ.
బాలీవుడ్ తార నేహా శర్మ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నేహా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. భాగల్‌పూర్‌లో జేడీయూకి చెందిన అజయ్ మండల్ కాంగ్రెస్‌కు చెందిన అజిత్ శర్మతో తలపడతారు. భాగల్‌పూర్ సీటుపై సిట్టింగ్ జేడీయూ ఎంపీ అజయ్ మండల్‌పై మాత్రమే ఎన్‌డీఏ విశ్వాసం వ్యక్తం చేసింది. కాగా, విపక్షాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మకు టికెట్ ఇచ్చారు. 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. భాగల్‌పూర్‌తో పోటీ ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…