Viral: షర్ట్ విదిలిస్తే కరెన్సీ కట్టలు.. గుండు అన్నియ్య మాములోడు కాదు

ఎన్నికల జాతరలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు.. నోట్ల మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఎప్పటి నుంచో దాచి పెట్టిన నోట్ల కట్టలను.. ఇప్పుడు బయటకు తీసి సైలెంట్‌గా ఓటర్లకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో భారీగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న నగదును చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Viral: షర్ట్ విదిలిస్తే కరెన్సీ కట్టలు.. గుండు అన్నియ్య మాములోడు కాదు
Caught With Cash
Follow us

|

Updated on: Apr 23, 2024 | 10:43 AM

ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ విసృత తనిఖీలు చేస్తున్నాయి. పెద్ద, పెద్ద కార్లు, కంటైనర్లను మాత్రమే కాదు.. ఆర్టీసీ బస్సులు, ద్విచక్రవాహనాలను సైతం చెక్ చేస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, తమిళనాడులో ఒక వ్యక్తి తన దుస్తులలో దాచి… రూ.14 లక్షలను తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. కేరళ-తమిళనాడు సరిహద్దులోని వాలాయార్ చెక్‌పోస్టు వద్ద బస్సును ఆపారు అధికారులు. అందులోని ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో.. అతన్ని కిందకి దిగాల్సిందిగా కోరారు. ఆ వ్యక్తిని బస్సు నుండి దింపి, తనిఖీ చేస్తున్నప్పుడు, షర్ట్  లోపల లైనింగ్ నుండి నగదు కట్టలను బయటకు జారాయి. లెక్కెట్టగా మొత్తం 14 లక్షలు తేలాయి. నిందితుడ్ని వినో అనే వ్యక్తిగా గుర్తించారు.

మోడల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఒక వ్యక్తి కేవలం రూ. 50,000 మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది. అంతకుమించిన డబ్బు క్యారీ చేస్తుంటే.. సబంధిత డాక్యుమెంటేషన్ అవసరం. దీంతో వినో నుంచి క్యాష్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు. తదుపరి విచారణ జరుగుతోంది.  కేరళ లోక్‌సభ ఎంపీలను ఎన్నుకునేందుకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్‌కు ముందు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. (S0urce)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?