AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డ్

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. బీహార్‌ , బెంగాల్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటివరకు ఏ ప్రధాని వెళ్లని ప్రాంతాలను సైతం ప్రధాని మోదీ చుట్టేస్తున్నారు.

PM Modi: బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డ్
Pm Modi In Raiganj
Balaraju Goud
|

Updated on: Apr 16, 2024 | 7:15 PM

Share

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. బీహార్‌ , బెంగాల్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటివరకు ఏ ప్రధాని వెళ్లని ప్రాంతాలను సైతం ప్రధాని మోదీ చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో లోక్‌సభ ఎన్నికల ర్యాలీని నిర్వహించా నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాయ్‌గంజ్‌లో రోడ్‌షో నిర్వహించిన వారం రోజుల తర్వాత మోదీ ర్యాలీ నిర్వహించడం విశేషం. తన ప్రచార సమయంలో కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహించారు. మార్గంలో ప్రజలను కలుసుకుని పలకరించారు. అడుగడున ఘన స్వాగతంతో జనం మోదీకి నిరాజనం పలికారు.

దేశమంతా నమో నమామి అంటోంది. చాలా సర్వేలు బీజేపీదే విజయం అంటున్నాయి. ఔర్‌ ఏక్‌ ధక్కా…హ్యాట్రిక్‌ పక్కా అంటున్నాయి బీజేపీ వర్గాలు. అబ్‌ కీ బార్‌…చార్‌ సౌ పార్‌ అంటోంది కాషాయ కూటమి. అయితే 400 సీట్లు దాటాలంటే మామూలు పొలిటికల్ ఫీట్లు సరిపోవు. అందుకే పార్టీ బలం లేని ప్రాంతాలను ఎంచుకుని మరీ ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు, కేరళలో పర్యటించిన నరేంద్ర మోదీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌ల్లో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా బెంగాల్‌లో టీఎంసీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. ఆదివాసీలు , దళితులు , పేదలను టీఎంసీ , లెఫ్ట్‌ నేతలు తీవ్రంగా అణచివేశారని విమర్శించారు. ఈ వర్గాలను టీఎంసీ బానిసల్లా చూసిందన్నారు. ఆదివాసీ మహిళలను మోకాళ్లపై కూర్చోబెట్టిన టీఎంసీ నేతలను ప్రజలు త్వరలో మోకాళ్లపై నిలబెడుతారని అన్నారు. బెంగాల్‌లో రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు టీఎంసీ కుట్ర చేసిందని ఆరోపించారు మోదీ. కోర్టు చివాట్లు పెట్టినా బెంగాల్‌ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదన్నారు. రాయ్‌గంజ్‌తో పాటు, బెంగాల్‌లోని బలూర్‌ఘాట్ జిల్లాలో కూడా ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలో ఉన్న రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీల మధ్య గట్టి పోరుకు సాక్ష్యం కానుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ తన అభ్యర్థిగా కృష్ణ కళ్యాణిని రాయ్‌గంజ్ స్థానం నుండి బరిలోకి దింపగా, బీజేపీకి చెందిన కార్తిక్ పాల్‌ పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీకి చెందిన దేబశ్రీ చౌధురి రాయ్‌గంజ్ స్థానాన్ని 60,574 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. 2014లో, CPIM నుండి మహ్మద్ సలీం 1,634 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్సిని ఓడించి, సీటును గెలుచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…