UPSC CSE Result 2023: యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి.. పాలమూరు బిడ్డ అనన్యకు ఎన్నో ర్యాంకో తెలుసా?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాస్తవ సత్తాచాటారు. అలాగే రెండో స్థానంలో అనిమేష్‌ ప్రధాన్‌, మూడో స్థానంలో దోనూరు అనన్యారెడ్డి ఉన్నారు. ఈసారి టాప్-5లో ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. అదే సమయంలో టాప్ 10లో 6 మంది అబ్బాయిలు, 4 మంది అమ్మాయిలు ఉన్నారు. జాబితాలో డోనూరు..

UPSC CSE Result 2023: యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి.. పాలమూరు బిడ్డ అనన్యకు ఎన్నో ర్యాంకో తెలుసా?
Upsc Results 2023
Follow us

|

Updated on: Apr 16, 2024 | 6:26 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాస్తవ సత్తాచాటారు. అలాగే రెండో స్థానంలో అనిమేష్‌ ప్రధాన్‌, మూడో స్థానంలో దోనూరు అనన్యారెడ్డి ఉన్నారు. ఈసారి టాప్-5లో ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. అదే సమయంలో టాప్ 10లో 6 మంది అబ్బాయిలు, 4 మంది అమ్మాయిలు ఉన్నారు. జాబితాలో డోనూరు అనన్య మూడో స్థానంలో, రుహాని ఐదో స్థానంలో, దాబాస్ ఆరో స్థానంలో, నౌషీన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఈ ఫలితాల్లో తెలుగమ్మాయి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి ఈ ర్యాంకు సాధించారు.

ట్యాప్‌ 10 ర్యాంకుల్లో వీళ్లే

  1. ఆధిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు
  2. అనిమేష్‌ ప్రధాన్‌ – 2వ ర్యాంకు
  3. దోనూరు అనన్యరెడ్డి – 3వ ర్యాంకు
  4. పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ – 4వ ర్యాంకు
  5. రుహానీ – 5వ ర్యాంకు
  6. సృష్టి దబాస్‌ – 6వ ర్యాంకు
  7. అన్‌మోల్‌ రాఠోర్‌ – 7వ ర్యాంకు
  8. అశీష్ కుమార్ – 8వ ర్యాంకు
  9. నౌషీన్‌ -9వ ర్యాంకు
  10. ఐశ్వర్యం ప్రజాపతి -10వ ర్యాంకు

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మే 28వ తేదీన ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ఇందులో పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడించారు. ఇందులో 1016 మందిని యూపీఎస్సీ (UPSC)కి ఎంపిక చేయగా, జనరల్‌ కేటగిరిలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీ కేటగిరిలో 165 మంది, ఎస్టీ కేటగిరిలో 86 మందిని ఎంపిక చేశారు.