Lok Sabha Election: జలోర్ సభలో ప్రధాని నరంద్ర మోదీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే విషయాలు పెద్దగా లేవన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ. అశోక్ గెహ్లోత్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగగానే, రాజస్థాన్‌లో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ప్రియాంక గుర్త చేశారు. ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చడంలో ప్రధాని మోదీ ఆరితేరారని విమర్శించారు.

భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే విషయాలు పెద్దగా లేవన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ. అశోక్ గెహ్లోత్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగగానే, రాజస్థాన్‌లో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ప్రియాంక గుర్త చేశారు. ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చడంలో ప్రధాని మోదీ ఆరితేరారని విమర్శించారు
రాజస్థాన్‌లో ప్రభుత్వం మారగానే అశోక్ గెహ్లోత్ చేపట్టిన పథకాలన్నీ ఆగిపోయాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశ నాయకత్వాన్ని నిర్ణయించే ఎన్నికల్లో ఎంతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఝాలోర్ కాంగ్రెస్ ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. ప్రధాని కాసేపు గాల్లో ఎగురుతారని, కాసేపు సముద్రపు అడుగుకు వెళ్తారని, అలాంటి పనుల వల్ల సాధారణ ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రియాంక ప్రశ్నించారు. సంపూర్ణ అధికారం దక్కడంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రియాంక ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడంలో మోదీ ఆరితేరారని విమర్శించారు. ప్రజలతో మోదీకి సంబంధాలు తెగిపోయాయని విమర్శించారు. రాజస్థాన్ ప్రజలు విజ్ఞతతో ఓటేయ్యాలన్నారు . దేశసంపద కొద్దిమంది బడా వ్యాపారవేతల చేతుల్లోనే మోదీ పెట్టారని విమర్శించారు. బీజేపీ పాలనలో యువత , మహిళలు చాలా కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు ప్రియాంక. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కేంద్రంలో అధికారం లోకి రావాలన్నారు .
లేని శూరత్వాన్ని మోదీ ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు కబీర్‌దాస్‌ను గోరఖ్‌నాథ్‌తో కలిపేస్తారు. కొన్నిసార్లు బురద నుంచి గ్యాస్‌ను తీస్తారు. కొన్నిసార్లు మేఘాల్లో మిస్సైళ్లను వదులుతారు. లేదంటే శాఖాహారం..మాంసాహారం గురించి మాట్లాడుతారు. కళ్లముందే నిరుద్యోగం, అధిక ధరల లాంటి భూతం కన్పిస్తుంటే మోదీ వాటిని పట్టించుకోవడం లేదన్నారు ప్రియాంక.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




