Chinese Loan Apps: లోన్ యాప్‌లపై ఈడీ చర్యలు.. డిపాజిట్ చేసిన రూ.46 కోట్ల లావాదేవీలపై నిషేధం

Chinese Loan Apps: చెల్లింపు సేవా ప్లాట్‌ఫారమ్‌లు Easebuzz, Razorpay, Cashfree,Paytm, ఆన్‌లైన్ ఖాతాలలో జమ చేసిన రూ. 46.67 కోట్ల వ్యాపార సంస్థల లావాదేవీలను..

Chinese Loan Apps: లోన్ యాప్‌లపై ఈడీ చర్యలు.. డిపాజిట్ చేసిన రూ.46 కోట్ల లావాదేవీలపై నిషేధం
Follow us

|

Updated on: Sep 17, 2022 | 8:30 AM

Chinese Loan Apps: చెల్లింపు సేవా ప్లాట్‌ఫారమ్‌లు Easebuzz, Razorpay, Cashfree,Paytm, ఆన్‌లైన్ ఖాతాలలో జమ చేసిన రూ. 46.67 కోట్ల వ్యాపార సంస్థల లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిషేధించింది. చైనీస్ వ్యక్తులు నియంత్రించే యాప్‌ల ద్వారా తక్షణ రుణాలు ఇస్తున్న కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఈ వారం ఈ చైనా లోన్‌ యాప్‌ ప్లాట్‌ఫారమ్‌లపై ఈడీ దాడులు నిర్వహించింది.

ఈ నెల ప్రారంభంలో బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ సంస్థలపై దాడులు నిర్వహించి వారి ఖాతాల్లో జమ చేసిన రూ.17 కోట్లను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సెప్టెంబర్ 14న ఢిల్లీ, ముంబై, ఘజియాబాద్, లక్నో, గయాలోని నిందితుల స్థలాలపై దాడులు జరిగాయి. HPZ అనే యాప్ ఆధారిత టోకెన్, సంబంధిత సంస్థలపై విచారణకు సంబంధించి ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణె, చెన్నై, హైదరాబాద్, జైపూర్, జోధ్‌పూర్, బెంగళూరులో ఉన్న 16 బ్యాంకులు, చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను కూడా ED పరిశీలించింది.

అక్టోబర్ 2021లో ఎఫ్‌ఐఆర్‌:

ఇవి కూడా చదవండి

దీనిపై అక్టోబర్ 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నాగాలాండ్‌లోని కొహిమా పోలీసుల సైబర్ క్రైమ్ బ్రాంచ్ ద్వారా నమోదు చేశారు. ఈ సోదాల్లో నేరంలో హస్తం ఉన్నట్లు చూపించే అనేక పత్రాలు దొరికాయని, వాటిని జప్తు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఎడ్జ్‌బజ్‌లో రూ. 33.36 కోట్లు, రేజర్‌పేలో రూ. 8.21 కోట్లు, క్యాష్‌ఫ్రీలో రూ.1.28 కోట్లు డిపాజిట్ చేసినట్లు గుర్తించారు అధికారులు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ఖాతాల్లో మాత్రమే రూ.46.67 కోట్లు స్తంభింపజేసినట్లు తెలిపారు.

ED కార్యకలాపాలకు తాము పూర్తి సహాయాన్ని అందజేస్తున్నామని, విచారణ జరిగిన కొన్ని గంటల్లోనే అవసరమైన సమాచారం అందించామని క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ ప్రతినిధి తెలిపారు. మారటోరియం విధించిన ఫండ్ కంపెనీకి చెందిందని పేటీఎం తెలిపింది. దర్యాప్తు చేస్తున్న యూనిట్లు స్వతంత్ర వ్యాపారాలు అని Paytm తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది